అప్పుడు నమ్మలేదు..ఇప్పుడు నమ్మక తప్పటం లేదు...
లోకనాయకుడు కమలహాసన్ తాజా చిత్రం ‘విక్రమ్’ ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 300 కోట్లను వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. దాదాపు నాలుగేళ్ల పాటు కమల్ సినిమాలకు దూరంగా ఉన్నా పవర్‌ఫుల్ కమ్‌బ్యాక్ మూవీగా నిలిచింది. ఇన్నేళ్ల తర్వాత వచ్చిన తన సినిమా ఈ రేంజ్‌లో కలెక్షన్స్ సాధిస్తుండటం పట్ల కమల్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రూ. 300 కోట్లు సంపాదిస్తానని గతంలో తాను చెపితే ఎవరూ నమ్మలేదని, కనీసం తన మాటలను పట్టించుకోలేదని కమల్ చెప్పారు. ‘విక్రమ్’ సినిమా వసూళ్లతో ఇప్పుడు తన మాట నిజమైందని అన్నారు.
ఈ సినిమాతో వచ్చిన డబ్బులతో తన అప్పులన్నింటినీ తీర్చేస్తానని చెప్పారు. తనకు ఇష్టమైన ఆహారాన్ని తింటానని అన్నారు. కుటుంబానికి, సన్నిహితులకు చేతనైనంత సాయం చేస్తానని చెప్పారు. డబ్బులు అయిపోయాక ఇవ్వడానికి తన వద్ద ఏమీ లేదని చెపుతానని అన్నారు. ఇతరుల దగ్గర డబ్బులు తీసుకుని పక్కవాళ్లకు సాయం చేయాలనే ఉద్దేశం మాత్రం తనకు లేదని చెప్పారు.నాకు గొప్ప పేరు వద్దు, మంచి మనిషిగా ఉండాలనుకుంటున్నట్లు తెలిపారు.