GoliSoda Now In New Flavers : ట్రెండ్‌కి తగినట్టుగా మారిన గోలిసోడా !

0

80, 90 లు దశకంలో వేసవి వచ్చిందంటే చాలు చిన్నా పెద్ద తేడా లేకుండా గోలీ సోడాతో వేసవి తాపాన్ని తీర్చుకునేవారు. జాతరైనా, వేడుకలైనా గోలీ సోడాకు ఫుల్‌ డిమాండ్‌ ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. మార్కెట్లోకి పలు కూల్‌డ్రిరక్స్‌ రావటంతో గోలీ సోడా తన ప్రాభవాన్ని కోల్పోయింది. తెలుగు రాష్ట్రాలలో ఒకప్పుడు గోలీ సోడా చేసిన గోల అంతా ఇంతా కాదు. వేసవికాలం వచ్చిందంటే చాలు స్థానికంగా తయారయ్యే గోలీ సోడాకు ఓ టైంలో ఫుల్‌ డిమాండ్‌ ఉండేది.  అలానే అనేక సంవత్సరాలు గోళీ సోడా ఒక ఊపు ఊపింది.. అది తాగితేనే గాని ఉపశమనం పొందే పరిస్థితి ఉండేది కాదు. కడుపు ఉబ్బరంగా.. పట్టేసినట్టు.. అన్నం అరగలేనట్టు.. తేన్పు రాలేనట్టు ఉన్నా ఒక్క గోళీ సోడా తాగితే వీటన్నింటికీ సమాధానం చెప్పేది. ఒకప్పుడు చిన్న చిన్న గల్లీల నుంచి పెద్ద పెద్ద పట్టణాల వరకు ఎక్కడ చూసినా అవే కనిపించేది. చిన్న చిన్న బడ్డీ కొట్టుల మొదలు పెద్ద పెద్ద హోటల్స్‌ వరకు విరివిరిగా కనిపించాయి.  రోజుకో రకం కూల్‌డ్రిరక్‌లు తక్కువ ధరకే అందుబాటులోకి రావడంతో అమ్మకాలు తగ్గి కాలక్రమీణ గోలీ సోడాలు కనుమరుగయ్యాయి. 

కొత్తదనంతో పునర్దర్శనం ! 

కానీ అదే సోడా కొత్తదనంతో పునర్దర్శనమిచ్చింది. మారుతున్న వ్యాపారానికి అనుగుణంగా రంగులద్దుకుని మార్కెట్‌లో కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కిళ్లీ షాపుల్లో మాత్రమే కనిపించే గోళీ సోడాలు కనుమరుగు కాగా, ఇప్పుడు ప్రత్యేక వాహనాల్లో కొత్త రూపంలో దర్శనమిస్తున్నాయి. గతంలో ప్రత్యేకంగా తయారు చేసిన గాజు సీసా తయారీలోనే గోలీ ఉండేది. దానిపై రబ్బరు వాషర్‌ ఏర్పాటు చేసి సగం వరకూ నీళ్లు పోసి మెషీన్‌ ద్వారా గ్యాస్‌ ఎక్కించి, సోడా తయారు చేసేవారు. దీనికి ఒక వ్యక్తి పూర్తి స్థాయిలో కష్టపడాల్సి వచ్చేది. మెషీన్‌పై సోడాలు తయారు చేయడం కొన్ని సమయాల్లో ప్రమాదాలకు దారి తీసేది. రాను రానూ కొత్త రకం యంత్రాలు అందుబాటులోకి రావడంతో సోడాతో పాటు డ్రిరక్‌లు సైతం నిమిషాల్లో తయారవుతున్నాయి. గతంలో వచ్చిన యంత్రాలు (సోడా హబ్‌లు) సీసాలతో పని లేకుండా కేవలం గ్లాసులు మాత్రమే ఉపయోగించడం వల్ల ఎటువంటి ప్రమాదాలు లేకపోగా త్వరితగతిన తయారవుతుండడంతో ఎక్కువ మంది వాటిపై మొగ్గు చూపారు. దీంతో అప్పటి వరకూ అందుబాటులో ఉన్న గోలీ సోడా కనుమరుగైంది. గ్రామీణ ప్రాంతాల్లో కీచ్‌... మంటూ శబ్దాలు వినిపించగానే గోళీ సోడా తాగుతున్నారనుకొనేవారు. ప్రత్యేకంగా తయారు చేసిన బండ్లపై సోడాలు అమ్ముతూ అనేక మంది జీవనం సాగించేవారు. ప్రస్తుతం వారందరూ కనిపించకుండా పోయారు. వారి స్థానంలో కొత్త ట్రెండ్‌లో వచ్చిన గోలీ సోడాలు ఆటోలు, ప్రత్యేక వాహనాల ద్వారా విక్రయిస్తున్నారు.

వివిధ ప్లేవర్లలో సోడా

ప్రస్తుత ప్రపంచంలో పాత వాటికి కొత్త రంగులు వేసి మార్కెట్‌లోకి తీసుకువస్తే అదే నయా ట్రెండ్‌గా మారిపోతోంది. ఎండలు భారీగా ఉండటంతో జనం కొబ్బరి నీళ్లు, లస్సీ, ఫ్రూట్‌ జ్యూస్‌ లాంటి లిక్విడ్‌ ఐటమ్స్‌​ను ఎక్కువగా తీసుకుంటున్నారు. కాగా వీటితో గోలీ సోడా పోటీ పడుతోంది. ఈ ఏడాది సిటీలో గోలీ సోడా సెంటర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు గ్రామాల్లోనే కనిపించే సోడాలు.. ఆ తర్వాత కనుమరుగయ్యాయి. కానీ రెండు మూడేండ్లుగా సిటీలో ఈ సెంటర్లు భారీగా పుట్టుకొచ్చాయి. గోలీ సోడా ఓ ట్రెండ్‌​గా మారింది. అనేక రెస్టారెంట్లలోనూ గోలీ సోడా అందిస్తున్నారు. ఒకప్పుడు సాల్ట్‌, స్వీట్‌, ఆరెంజ్‌ ఫ్లేవర్లు మాత్రమే లభించేవి. కానీ ఇప్పుడు వివిధ కలర్లతో పాటు గ్రేప్స్‌, జీరా, మ్యాంగో, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, ఫైనాఫిల్‌, సుగంధి వంటి ఫ్లేవర్లతో పదుల సంఖ్యలో ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు. ఫ్లేవర్‌​ను బట్టి ఒక్క సోడాను రూ.20 నుంచి రూ.50 వరకు అమ్ముతున్నారు. పాత సోడాకు కొత్త రంగులు కలిపి ఆకర్షణీయంగా తయారు చేసి, మార్కెట్‌లోకి తీసుకురావడంతో అందరూ వాటిని ఆస్వాదించడానికి ఉర్రూతలూగుతున్నారు.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !