తెలుగు క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ కీలక ఆటగాడు అంబటి రాయుడు (Ambati Rayudu) ఐపీఎల్ కెరియర్‌కు రిటైర్మెంట్ (retirement) ప్రకటించాడు. ఐపీఎల్ 2023 ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై మ్యాచ్ తనకు చివరిదని వెల్లడిరచాడు. 2010లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన రాయుడు ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరకు 203 మ్యాచ్‌లు ఆడి 28.29 సగటుతో 4,329 పరుగులు చేశాడు. అతడి ఖాతాలో ఓ సెంచరీ కూడా ఉంది.
2010-2017 వరకు ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన రాయుడు.. నిలకడగా ఆడుతూ జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. ఎన్నో మ్యాచ్‌ల్లో ముంబయిని ఒంటిచేత్తో గెలిపించాడు. ఇప్పటివరకు ఐదు టైటిల్స్‌ను గెలుచుకున్న అంబటి రాయుడు.. నేడు గుజరాత్‌పై చెన్నై గెలిస్తే ఆరో టైటిల్‌ను ఖాతాలో వేసుకుంటాడు. ముంబయి ఇండియన్స్ తరఫున (2013, 2015, 2017).. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున (2018, 2021)లో టైటిల్‌ను అందుకున్నాడు. 2018లో సీఎస్కే ఛాంపియన్‌గా నిలవడంలో రాయుడిదే కీలకపాత్ర. ఆ సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడి 43 సగటుతో 602 పరుగులు సాధించాడు. అదే సీజన్‌లో ఐపీఎల్‌లో శతకాన్ని నమోదు చేశాడు.
యూ టర్న్ ఉండదు...ట్వీటర్‌లో రాయుడు పోస్ట్.
రెండు గొప్ప టీమ్‌లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. 204 మ్యాచ్‌లు. 14 సీజన్లు, 11 ప్లే ఆఫ్స్, 8 ఫైనల్స్, 5 ట్రోఫీలు. ఈ రోజు రాత్రి 6వ టైటిల్ కూడా దక్కుతుందనుకుంటున్నాను. చక్కటి ప్రయాణం. ఈ రోజు రాత్రి జరిగే ఫైనల్ మ్యాచే ఐపీఎల్ కెరియర్‌లో చివరి మ్యాచ్‌గా నిర్ణయించుకున్నాను. ఇంత గొప్ప టోర్నమెంట్‌లో ఆడడం నిజంగా ఆస్వాదించాను. అందరికీ ధన్యవాదాలు. ఈ నిర్ణయంలో యు టర్న్ ఉండదు’’ అని అంబటి రాయుడు తన అఫీషియల్ ట్విటర్ అకౌంట్‌లో రాసుకొచ్చాడు. కాగా అంబటి రాయుడు ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.