TSRTC : మహాలక్ష్మీ పథకం...9 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం !

0

తెలంగాణలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. శనివారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలో బాలికలు, మహిళలు, ట్రాన్స్‌ జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇదొకటి. అయితే, పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మాత్రమే మహిళల ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

తెలంగాణ వారికి మాత్రమే 

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వయసుల బాలికలు, మహిళలు, లింగమార్పిడి వ్యక్తుల కోసం మహాలక్ష్మి పథకం రేపటి నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలో టీఎస్‌ఆర్‌టీసీ యొక్క పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులలో మహాలక్ష్మి పథకం అమలవుతుందని ప్రభుత్వం జీవో జారీ చేసింది. తెలంగాణకు చెందిన అన్ని వయసుల బాలికలు మరియు మహిళలు, లింగమార్పిడి వ్యక్తులకు ఈ పథకం వర్తిస్తుంది. 9వ తేదీ(శనివారం) మధ్యాహ్నం నుండి పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులలో తెలంగాణ రాష్ట్ర సరిహద్దులలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు అంతర్‌ రాష్ట్ర ఎక్స్‌ప్రెస్‌, పల్లె వెలుగు బస్సులలో ప్రయాణం ఉచితం. మహిళా ప్రయాణికులు ప్రయాణించే వాస్తవ దూరం ఆధారంగా వసూలు చేసే ఛార్జీల కోసం తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌ఆర్టీసీకి ఖర్చును రీయింబర్స్‌ చేస్తుంది. జీవో నంబర్‌ 47 ద్వారా మహాలక్ష్మి పథకం విధివిధానాలను ప్రభుత్వం వెల్లడిరచింది. సోనియా గాంధీ పుట్టిన రోజు పురస్కరించుకుని డిసెంబర్‌ 9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరూ ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు. అయితే.. ఉచిత బస్సు ప్రయాణం విషయంలో ఇంకా విధి విధానాలు ఖారారు కాలేదని.. అమలు జరిగిన తర్వాత వచ్చే సమస్యలపై చర్చించి పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు.  ఆధార్‌ కార్డు ఉంటే చాలు.. మహిళలందరూ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించివచ్చని తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !