60 బర్త్‌డే రోజున 60 వేల కోట్ల దానమిచ్చిన అదానీ !

0



ఆసియా కుబేరుల జాబితాలో ఒకరు, దేశంలోని అగ్రవ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గౌతమ్‌ అదానీ 60వ పుట్టినరోజు, ఆయన తండ్రి శాంతిలాల్‌ అదానీ 100వ పుట్టినరోజు సందర్భంగా అదానీ కుటుంబం జూన్‌ 23న అతిపెద్ద ప్రకటన చేశారు. రూ. 60,000 కోట్లను ఛారిటీ కార్యక్రమాలకు వెచ్చించనున్నట్లు వెల్లడిరచారు. ఈ విరాళాన్ని అదానీ ఫౌండేషన్‌ నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. ఈ మొత్తాన్ని ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన కార్యకలాపాలకు వెచ్చించనున్నట్లు తెలిపారు. 1962 జూన్‌ 24న అదానీ గుజరాత్‌ లో జన్మించారు. 1988లో కమోడిటీస్‌ ట్రేడిరగ్‌ ప్రారంభించిన ఆయన ఇప్పుడు దేశంలోని అనేక రంగాల్లో తన వ్యాపారాలను విస్తరించి ఆసియాలోని కుబేరుల జాబితాలోకి ఎక్కారు. ట్విట్టర్‌ వేదికగా గౌతమ్‌ అదానీ ఈ విరాళాన్ని ప్రకటించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !