ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు..

0


ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల  శనివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రత్యూష ఆత్మహత్యకు సంబంధించి షాకింగ్ నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నొప్పిలేకుండా సులభంగా చనిపోయేందుకు ఆమె ఇంటర్నెట్‌లో వెతికినట్లు తెలుస్తోంది.

అందుకే కార్బన్ మోనాక్సైడ్‌ను కొని తెచ్చుకున్నట్లు కూడా పోలీసులు చెబుతున్నారు. ఏమాత్రం నొప్పి తెలియకుండా ఈజీగా చనిపోవాలనే ఉద్దేశంతో ప్రత్యూష ఇంటర్నెట్‌లో కూడా వెతికినట్లు తెలుస్తోంది. పదిరోజుల క్రితమే ఆమె సూసైడ్‌కు ప్లాన్ చేసుకున్నారు. 

ఇంటి వద్ద కుటుంబసభ్యులు ఉంటారనే భయంతో ఆమె బోటిక్‌లో సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం. వారం క్రితం వడ్రంగిని పిలిపించి.. ఆమె.. బోటిక్‌లో వాష్ రూం కిటికీలను,ఎగ్జాస్టర్ ఫ్యాన్ ప్రాంతాన్ని కూడా మూసివేయించింది. ప్రత్యూష ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానికి పాస్ వర్డ్ ఉండటంతో.. సాంకేతిక నిపుణుల సాయంతో ఒకంట్రెండు రోజుల్లో ఓపెన్ చేస్తామని పోలీసులు తెలిపారు.అంతేకాదు ప్రత్యూష తన బొటిక్ వద్ద పనిచేసిన వాచ్ మెన్ ఆయన భార్యను కూడా లోపలికి రావొద్దని సూచించారు. పని ఉంటే తాను పిలుస్తానన్నారు. ఉదయం తలుపు తీయకపోవంతో.. రెండు సార్లు వచ్చి తలుపు తట్టినా తీయలేదన్నారు. ప్రత్యూష గరిమెళ్ల మృతి గురించి ఉపాసన ట్వీట్ చేయగా ఆ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.ప్రత్యూష గరిమెళ్ల తన డియరెస్ట్ ఫ్రెండ్ అని ఆమె పేర్కొన్నారు. ప్రత్యూష మరణం వల్ల తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ఆమె చెప్పుకొచ్చారు.ప్రత్యూష ప్రతి విషయంలో ఉన్నతంగా ఆలోచించేవారని ఉపాసన కామెంట్లు చేశారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !