వెండితెరపై దూసుకుపోతున్న అందాల శ్రీలీల !

0



తొలి చిత్రం ‘పెళ్లి సందడి’తో విపరీతమైన క్రేజ్‌ సొంతం చేసుకుంది శ్రీలీల. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. పెళ్లి సందడి చిత్రం తర్వాత తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు చిత్రాలున్నాయి. మంగళవారం శ్రీలీలా పుట్టినరోజు సందర్భంగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఫార్చున్‌ 4 సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘అనగనగా ఒకరాజు’ చిత్ర బృందం ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ సినిమాలో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. పంజా వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఈ చిత్రం కాకుండా రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ‘ధమాకా’ లో శ్రీలీలా కథానాయికగా నటిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్ప్‌ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇవే కాకుండా నితిన్‌,వక్కంతం వంశీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలోనూ లీలా నాయికగా ఎంపికైంది. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !