ఫైర్‌ఫాక్స్, ఒపెరా, గూగుల్ క్రోమ్ వంటి బ్రౌజర్లు రావడంతో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు ఆదరణ తగ్గిపోయింది. ఐఈతో పోలిస్తే మిగిలిన బ్రౌజర్లలో ఫీచర్లు ఎక్కువగా ఉండటమే కాకుండా పేజి లోడిరగ్ స్పీడ్ కూడా ఎక్కువగా ఉండేది. దీంతో ఆ బ్రౌజర్ల పోటీని ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ తట్టుకోలేకపోయింది. తమ బ్రౌజర్లలో పలు మార్పులు చేసినప్పటికీ అవి కస్టమర్లను ఆకట్టుకోలేకపోయాయి. అలా కొద్దిరోజులకు మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఒక డిఫాల్ట్
బ్రౌజర్‌గా మిగిలిపోయింది తప్ప కస్టమర్లకు చేరువకాలేకపోయింది. దీంతో ఈ బ్రౌజర్‌లో ఫీచర్స్‌ను డెవలప్ చేయడం కూడా మానేసింది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు ఆదరణ తగ్గిపోవడంపై దృష్టిసారించిన మైక్రోసాఫ్ట్ సంస్థ.. ఐఈ స్థానంలో అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌తో మళ్లీ రావాలని నిర్ణయించుకుంది. అలా ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ స్థానంలో ఎడ్జ్ బ్రౌజర్‌ను తీసుకొచ్చింది. ఇది వేగవంతమైన బ్రౌజర్ మాత్రమే కాదని.. సెక్యూరిటీ పరంగా కూడా చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంటుందని మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రతినిధులు పలుమార్లు చెప్పారు. ఇక ఇప్పుడు ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ పూర్తిగా పనిచేయకుండా పోతున్న క్రమంలో ఆ బ్రౌజర్ ఆధారిత వెబ్‌సైట్లు అన్నింటినీ ఎడ్జ్ బ్రౌజర్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చని చెబుతున్నారు.
కాలగర్భంలో కలిసిపోతున్న మైక్రోసాప్ట్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ !
జూన్ 15, 2022
0
Tags