పొట్టి బట్టలు వేసుకోవద్దని ఆ క్షణమే డిసైడ్ అయ్యా...

0


దగ్గుబాటి రానా  హీరోగా రూపొందిన కొత్త సినిమా 'విరాటపర్వం'. వేణు ఊడుగుల  దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రానాతో నాచురల్ క్వీన్ సాయి పల్లవి  తెరపంచుకుంది. జూన్ 17న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్ . ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన మేకర్స్.. పలు ప్రమోషనల్ ఈవెంట్స్ చేస్తూ ఈ విరాటపర్వం చిత్రాన్ని ప్రేక్షక లోకానికి చేరువ చేస్తున్నారు. ఇందులో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న సాయి పల్లవి.. చాలా విషయాలపై ఓపెన్ అవుతూ తన పర్సనల్ విషయాలను అభిమానులతో పంచుకుంటోంది. 

ఇందులో భాగంగా సినిమాల్లో పొట్టి బట్టలు వేసుకోవడం, కెమెరా ముందు చిన్న దుస్తుల్లో కనిపించడం అనే విషయమై సాయి పల్లవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సాధారణంగా అందరు హీరోయిన్లతో పోల్చితే సాయి పల్లవి వస్త్రాధారణ చాలా డిఫరెంట్. ఎప్పుడూ పొట్టి బట్టలు ధరించి కెమెరా ముందు కనిపించదు సాయి పల్లవి. అయితే తాజాగా అందుకు కారణాలు వెల్లడించింది సాయి పల్లవి. 

గ్లామర్ షోకు దూరంగా ఉంటూ, కేవలం పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ ద్వారానే ప్రేక్షకులను మెప్పిస్తున్న సాయి పల్లవి.. తాను పొట్టి బట్టలేసుకోకపోవడానికి ఓ బలమైన రీజన్ ఉందని చెప్పింది. తాను గ్లామర్ షోకి వ్యతిరేకం కాదని, పొట్టి బట్టలు వేసుకోవడం తప్పు అని తాను అనడం లేదని చెప్పింది. తాను వైద్యవిద్య కోసం జార్జియా వెళ్ళినప్పుడు అక్కడ టాంగో డాన్స్ నేర్చుకున్నానని, టాంగో డాన్స్ చేసేటపుడు అందుకు వీలుగా ఉండే క్యాస్టూమ్స్ మాత్రమే ధరించాల్సి వస్తుంది కాబట్టి కాస్త కురచైన దుస్తులు వేసుకున్నానని తెలిపింది.

అయితే ఆ టాంగో డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దానిపై నెటిజన్ల నుంచి వచ్చిన కామెంట్స్ తనను ఎంతో ఇబ్బంది పెట్టాయని సాయి పల్లవి చెప్పింది. ఆ క్షణం నుంచే పొట్టి బట్టలు వేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నని ఆమె చెప్పింది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !