ఏపీలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వీతీయ సంవత్సర ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఈ మథ్యాహ్నం 12. 30 నిమిషాలకు విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలు విడుదల చేయనున్నారు. మే 6 నుండి 25 వరకు ఇంటర్ పరీక్షలు జరుగ్గా, రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల కోసం ఈ వెబ్‌సైట్ నందు చూడగలరు. www.bie.ap.gov.in examresults.ap.nic.in
జూన్ 25 న తెలంగాణ ఇంటర్ ఫలితాలు ?
ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను ఈ నెల 25 న విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డ్ కసరత్తు చేస్తోంది. పరీక్షలు మే 24తో పూర్తికాగా...పూర్తైన వెంటనే జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభించారు. తాజాగా మూల్యాంకన ప్రక్రియ పూర్తయినందున ఫలితాల విడుదలకు కసరత్తు ప్రారంభించారు. ఎలాంటి తప్పులు దొర్లకుండా తుది ఫలితాలు వెల్లడిరచేందుకు బోర్డ్ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోందని సమాచారం.