దేశవ్యాప్తంగా కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. కొత్త కేసులు భారీగా పెరిగాయి. 4 లక్షల కరోనా నిర్థారణ పరీక్షలు జరుపగా ఒక్కరోజే 17336 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, కేరళలో 9 వేల మందికి పైగా కరోనా బారినపడ్డారు. ఢల్లీిలోనూ కేసులు సంఖ్య రెట్టింపు అయ్యింది. అయితే వైరస్ క్రమంగా వ్యాపిస్తుడటంతో క్రీయాశీల కేసులు గణనీయంగా పెరిగాయి. దేశంలో కరోనా వ్యాప్తి పెరగటంతో కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా గురువారం అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిఘా, జీనోమ్ సీక్వెన్సింగ్,ఆసుప్రతిలో చేరే వారి వివరాలను దృష్టి సారించాలని ఆదేశించారు. అర్హులైన వారికి టీకాను వేగవంతం చూస్తూ అదే సమయంలో టీకా వృధా కాకుండా దృష్టి పెట్టాలని అధికారులను కోరారు.