కచ్చితమైన వ్యూహం, పక్కా ప్రణాళిక, భారీ ప్రచారం...జనంలోకి ఎప్పుడు ఎలా వెళ్ళాలో తెలిసినోడు...భాష్యం ప్రవీణ్. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఇప్పుడు ఈ పేరు తెలియని వాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు. పార్టీకి 10 లక్షల విరాళం, మహనాడు వేదికకు వచ్చిన కార్యకర్తలకు భారీగా భోజన ఏర్పాట్లు, గుంటూరులో భాష్యం ప్రవీణ్ ట్రస్ట్ పేరుతో సేవా కార్యక్రమాలు...ఇలా ఓ ప్రణాళిక ప్రకారం జనంలోకి వెళుతున్నారు. అతికొద్ది సమయంలోనే తన పేరును జిల్లా వ్యాప్తంగా మార్మొగేలా చేస్తూ కీలక నాయకుడుగా ఎదుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో యువతకు దాదాపు 40 శాతం సీట్లు కేటాయిస్తానన్న అధినేత చంద్రబాబు సంకేతంతో తన రాజకీయ ప్రస్థానానికి పునాదులు వేసుకుంటున్నారు భాష్యం ప్రవీణ్. చంద్రబాబుతో పాటు చినబాబుతోనూ సన్నిహితంగా మెలుగుతున్నారు. అంతేకాదు గుంటూరు, కృష్ణ జిల్లా నాయకులతో లీడర్‌గా ప్రోజెక్ట్ చేసుకునే పనిలో ఉన్నారు. పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాలతో పాటు గుంటూరు `2 నియోజకవర్గాలను టార్గెట్ చేసుకుని రాజకీయాలు చేస్తున్నారు. దీంతో పాత నేతల్లో కలవరం మొదలైంది. ముఖ్యంగా పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు ఎక్కడ తమ నాయకత్వానికి ఎసరు వస్తుందో అన్న తెగ టెన్షన్ పడిపోతున్నట్లు వినికిడి.