తెలంగాణ పది ఫలితాలు విడుదల !

0

తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. 5 లక్షల 9 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. టెన్త్‌ ఫలితాల్లో 90 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈసారి కూడా అమ్మాయిలే పై చేయి సాధించారు. బాలికలు 92.45 శాతం, బాలురు 87.61 శాతంతో ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో తొలి స్థానంలో 97.85 శాతం ఉత్తీర్ణతతో సిద్ధిపేట జిల్లా నిలువగా.. చివరిలో 79 శాతం ఉత్తీర్ణతతో హైదరాబాద్‌ నిలిచింది. ఫలితాలను ఈ క్రింది వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చని అధికారులు ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయని మంత్రి తెలిపారు. ఇక 3 వేల పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదైందని పేర్కొన్నారు. 15 స్కూల్స్‌లో ఒక్కరూ కూడా పాస్‌ కాలేదని చెప్పారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !