రాష్ట్రపతిగా గెలుపెవరిది ?
జూన్ 22, 2022
0
ఎట్టకేలకు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా ఆయా కూటములు ప్రకటించాయి. ఇప్పుడు రాష్ట్రపతిగా గెలుపు ఎవరిని వరిస్తుంది అనేదే ప్రశ్న. విపక్షాలకు 52 % ఓటింగ్ ఉన్నా విజయావకాశాలు మాత్రం ఎన్డీఏ కూటమి అభ్యర్థినే వరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్క తాటిపైకి వస్తాయా ? కూటమి అభ్యర్థికి ఓటేస్తాయా ? అనే సంశయం అందరినీ వెంటాడుతుంది. రాజకీయ అవసరాలు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొన్ని పార్టీలు బయట నుండి మద్దతు తెలుపుతుండగా, కొన్ని పార్టీలు అసలు ఓటింగ్‌కు హజరుకాకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంది.
Tags