జెసీ ప్రభాకర్‌ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు !

0



టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఇంట్లో శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గతంలో అశోక్‌ లేల్యాండ్‌ నుండి కొనుగోలు చేసిన వాహనాల విషయంలో జరిగిన లావాదేవీలపై సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అలాగే ఫోర్జరీ డాక్యుమెంట్లతో వాహనాల రిజిస్ట్రేషన్లపై ఆరా తీశారు. స్క్రాప్‌ కింద వాహనాలు కొనుగోలు చేసి నకిలీ ఇన్వాయిస్‌తో జేసీ ట్రావెల్స్‌ నాగాలాండ్‌లో సుమారు వందకు పైగా వాహనాలకు అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు గుర్తించారు. జేసీ ముఖ్య అనుచరడు చవ్వా గోపాల్‌రెడ్డి ఇంట్లోనూ ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !