కేసీఆర్ దుర్మార్గమైన పాలనను అంతమొందించే బాధ్యత తనపై ఉందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తీవ్రమైన వాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను ఓడగొడితేనే తెలంగాణ రాష్ట్రానికి పట్టిన పీడ విరగడ అవుతుందన్నారు. ఉద్యమకారుడిగా తాను ప్రశ్నిస్తే.. పార్టీ నుంచి బయటకు పంపించారన్నారు. కేసీఆర్ కు కావాల్సింది కేవలం బానిసలేనన్నారు. కేసీఆర్ బలం, బలహీనతలు అన్ని తనకు తెలుసన్నారు. సీఎం కేసీఆర్‌ను బొందపెట్టేది తానేనంటూ మరోసారి సంచలన వాఖ్యలు చేశారు. డబ్బుతో తనను ఓడిరచాలని కేసీఆర్ కలలు కన్నారని ఎద్దేవా చేశారు ఈటల రాజేందర్. తనలాంటి వారు కేసీఆర్ నచ్చలేదన్నారు. ఆయనకు కావాల్సింది కేవలం బానిసలు మాత్రమేనన్నారు. అసెంబ్లీలో తన ముఖం కన్పించకుండా ఉండాలని ని కేసీఆర్ తనను ఓడిరచడానికి రూ.600 కోట్లు ఖర్చు చేశారని ధ్వజమెత్తారు ఈటల. పోలీసులు లేకుండా రావాలన్న నా భార్య సవాల్‌కు.. కేసీఆర్ సచ్చిపోవాలన్నారు. 50 శాతమున్న బీసీలకు 3 మంత్రి పదవులా అని ఈటల ప్రశ్నించారు . గిరిజనులకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నల వర్షం గుప్పించారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. సీఎం కేసీఆర్ సంస్కారం లేకుండా మాట్లాడారని మండిపడ్డారు కేసీఆర్‌ను ఈటల టార్గెట్ చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తానని ఆయన సంచలన ప్రకటన చేశారు. తన ప్రస్థానం గజ్వేల్ నుంచే ప్రారంభమైందని, ఇక్కడి నుంచి పోటీకి సంబంధించి ఇప్పటికే తాను క్షేత్రస్థాయిలో కార్యాచరణ చేపట్టినట్లు వెల్లడిరచారు. పశ్చిమ బెంగాల్‌లో తమ పార్టీ నేత సువేందు అధికారి, అక్కడి సీఎం మమతా బెనర్జీని ఓడిరచినట్లుగానే, తాను ఇక్కడ సీఎం కేసీఆర్‌ను ఓడిస్తానని స్పష్టం చేశారు. ‘‘కేసీఆర్‌ను ఢీకొట్టాలంటే మా పార్టీ నేతలు ఈగోలు పక్కనబెట్టాలి. చెట్టుకొమ్మపై ఉన్న పక్షి కన్ను మాత్రమే అర్జునుడికి కనిపించినట్లు, కేసీఆర్ మాత్రమే మాకు లక్ష్యం కావాలి’’ అని ఈటల వ్యాఖ్యానించారు.