అక్కినేని నాగచైతన్య, సమంత పెళ్ళి అయిన ఇద్దరూ కలిసి జీవించేందుకు చైతూ సామ్ పేరుమీద ఒక ఫ్లాట్ తీసుకుని కొన్నాళ్ళు అక్కడే కలిసి జీవించారు. విభేదాల కారణంగా విడాకులు తీసుకుని ఎవరి లైఫ్ వారు జీవిస్తున్నారు. బ్రేకప్ అనంతరం ప్లాట్‌ని అమ్మేసిన సమంత ఇప్పుడు అదే ఫ్లాట్‌ను సమంత ఎక్కువ ధరకు తిరిగి కొనుగోలు చేసిందని వెల్లడిరచారు మురళీ మోహన్. ప్రస్తుతం ఆ ఇంట్లో సామ్ తన తల్లితో జీవిస్తున్నట్టు తెలిపారు. అయితే తన భర్తతో జీవించిన ఫ్లాట్ కన్నా మంచిది వేరే కనిపించలేదు ఆమెకు. అందుకే తమ బిల్డింగ్‌ను కొనుగోలు చేసిన వ్యక్తినే తిరిగి తనకి ఆ ఫ్లాట్ అమ్మమని కోరింది. అయితే అతడు ముందు ఒప్పుకోకపోయినా.. తన దగ్గర కొన్నదానికన్నా ఎక్కువ ధరనే చెల్లిస్తానని చెప్పడంతో ఆమెకు తిరిగి అమ్మడానికి అంగీకరించాడు’ అని మురళీ మోహన్ చెప్పారు.