సీఎం జగన్ తల్లి, వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పార్టీ పదవికి రాజీనామా చేశారు. కూతురు షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినందున ఓ తల్లిగా ఆమెకు అండగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్లీనరీ వేదికగా విజయలక్ష్మీ ప్రకటించారు.రెండు పార్టీల్లో కొనసాగటం సరికాదన్న ఉద్ధేశ్యంతో వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్లు విజయమ్మ వెల్లడిరచారు. ఇప్పటి వరకు ఆదరించినందుకు నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.