యాంకర్‌ అనసూయ ఫైనల్‌ వార్నింగ్‌ !

0

స్టార్‌ యాంకర్‌గా పేరు తెచ్చుకొని సినిమాల పరంగా కూడా దూసుకుపోతున్న అనసూయకు మరోసారి సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌కు గురైయ్యారు. ఆమె డ్రెస్సింగ్‌ సెన్స్‌, వీడియోలపై ఎన్నోసార్లు ట్రోల్‌ చేశారు నెటిజన్లు. తాజా వ్యాఖ్యలపై స్ట్రాంగ్‌ రియాక్షన్‌ ఇచ్చింది అనసూయ. యాంకర్‌ అనసూయ వెండితెరపై ఎంత చలాకీగా కనిపిస్తుందో.. తెర వెనుక అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. తన జోలికి ఎవ్వరైనా వస్తే ఉతికి ఆరేస్తుంది. ముఖ్యంగా సోషల్‌ మీడియా ట్రోలింగ్‌ అస్సలు సహించదు అనసూయ. ఇలా ట్రోల్‌ చేస్తున్న వారిని చెడుగుడు ఆడుకోవడం ఈ జబర్దస్త్‌ బ్యూటీకి అలవాటే. వ్యక్తిగత దూషణ జరిగిన సందర్భాలు కూడా చూశాం. అయినప్పటికీ అనసూయ మాత్రం ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. తనపై ట్రోల్స్‌ చేసే వారికి ఎప్పటికప్పుడు కౌంటర్స్‌ ఇస్తూనే ఉంది. అదే సోషల్‌ మీడియా అస్త్రంగా ఎన్నోసార్లు విరుచుకుపడిన అనసూయ.. తాజాగా మరోసారి గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. లైగర్‌ సినిమా విడుదల కావడం, అనసూయ పరోక్షంగా విజయ్‌ దేవరకొండపై ఓ ట్వీట్‌ చేయడం ఆన్‌ లైన్‌ రచ్చకు తెరలేపింది. అమ్మను అన్న ఉసురు ఊరికే పోదంటూ అనసూయ చేసిన కామెంట్స్‌ దుమారం రేపాయి. దీంతో అనసూయ వర్సెస్‌ విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ వార్‌ ముదిరింది. ఈ క్రమంలోనే అనసూయపై ఓ రేంజ్‌ అటాక్‌ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. ఆంటీ ఈ పనులేంటి అంటూ వ్యక్తిగతమైన కామెంట్లు వదులుతున్నారు. ఇవి చూసిన అనసూయ.. అలాంటి వాళ్లందరికీ దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చింది. నేను మీకు ఆంటీనా..? నేను నా ఫ్యామిలీకి రిలేషన్‌ ఏంటి అని ప్రశ్నిస్తూ ఫైర్‌ అయింది. నా కుటుంబాన్ని ఇందులో ఇన్‌వాల్వ్‌ చేస్తున్నారు. అందరిపై కేసు పెడతా అని అనసూయ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్యాన్స్‌ వెనుక దాక్కునే పిరికి వ్యక్తిని కాదు నేను. నన్ను తిట్టిన వారందరి అకౌంట్స్‌కి సంబంధించి స్క్రీన్‌ షాట్స్‌ తీస్తున్నా. నాతో పెట్టుకున్నందుకు మీరంతా బాధపడే సమయం దగ్గరలోనే ఉంది. మీరు నన్ను తిట్టిన తిట్లను మీ హీరోలకు పంపండి అంటూ అనసూయ రెచ్చిపోయింది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !