నాగశౌర్య ` అనూషశెట్టి ప్రేమపెళ్ళి !

0

టాలీవుడ్‌లో మరో నటుడు పెళ్ళిపీటలు ఎక్కబోతున్నాడు. అతడు ఎవరో కాదు హీరో నాగశౌర్య. ఈ నెల 20 వ తేదీన బెంగుళూరులో నాగ శౌర్య వివాహం అనూష శెట్టితో జరగబోతోంది. ఇది ప్రేమ వివాహం అని నాగ శౌర్య తండ్రి తెలియచేశారు. అనూష శెట్టి బెంగుళూరులో ఆర్కిటెక్ట్‌ మరియు ఇంటీరియర్‌ డిజైనర్‌గా వర్క్‌ చేస్తున్నారు. అయితే నాగ శౌర్యకి అనూష ఎలా, ఎప్పుడు పరిచయం అన్నది ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.


నాగశౌర్య ఇప్పుడు టాలీవుడ్‌లో వున్న యంగ్‌ నటుల్లో ఒక టాలెంటెడ్‌ యాక్టర్‌. అతని చేతిలో ఇప్ప్పుడు చాలా ప్రాజెక్ట్స్‌ వున్నాయి.. బిజీగా ఉన్న యాక్టర్స్‌లో తను కూడా ఒకరు. నాగ శౌర్య వివాహం ఇలా సడెన్‌గా ఫిక్సవటం కొంచెం సర్‌ప్రైజింగ్‌గానే వుందని టాలీవుడ్‌లో అంటున్నారు. తల్లిదండ్రులకి కూడా నాలుగు రోజుల ముందు తెలిసింది అంటే.. అతని ప్రేమ వ్యవహారం ఎంత సీక్రెట్‌గా వుంచాడో అర్థం చేసుకోవచ్చు. నాగ శౌర్య తండ్రి శంకర్‌ ప్రసాద్‌ చాలా సంతోషంగా వున్నారు. తన కొడుకు ఇష్టమే తమ ఇష్టమని, చాలా సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు. పెళ్లి ఈనెల 20న ఉదయం 11.25కి ముహూర్తం ఫిక్స్‌ చేశారు. పెళ్లికి వచ్చే వాళ్లు భారతీయ సాంప్రదాయ దుస్తులను ధరించి మాత్రమే రావాలని శుభలేఖలో పేర్కొన్నారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !