- ఈడీ ముందుకు తలసాని బ్రదర్స్ !
- టీఆర్‌ఎస్ నాయకుల్లో టెన్షన్ !
- లిస్ట్‌లో 10 మంది ఎమ్మేల్యేలు !
- ఫామ్ హౌస్ ఫైల్స్‌కి ప్రతీకారమే కోసమేనా ?
క్యాసినో కేసుపై ఈడీ మళ్లీ దూకుడు పెంచింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులను విచారణకు పిలిచింది. విచారణకు హాజరైన మహేష్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్ నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు సమాచారం. విదేశాల్లో క్యాసినో ఆడటం చట్టబద్దమే అయినా.. అక్కడ జరిగిన లావాదేవీలపై ఫోకస్ పెంచారు అధికారులు. చికోటితో ఉన్న సంబంధాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. గతంలో ప్రవీణ్‌తో కలిసి విదేశాలకు మహేష్, ధర్మేందర్ వెళ్లినట్లు చెబుతున్నారు. తలసాని శ్రీనివాస్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు చీకోటి ప్రవీణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారనే విషయాన్ని ఈడీ ఇది వరకే నిర్థారించింది. మరోవైపు రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలతో చీకోటి ప్రవీణ్ వాట్సాప్‌లో చాటింగ్ చేసినట్టు గుర్తించారు. ఈ చాట్ ఆధారంగా సదరు రాజకీయ నాయకులతో ప్రవీణ్‌కు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ప్రవీణ్ ఇచ్చిన సమాధానాల ఆధారంగా, అవసరమైతే ఆ ప్రజాప్రతినిధులను ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
టీఆర్‌ఎస్ నేతలకు కేసీఆర్ భరోసా !
ఈడీ విచారణ అంటే.. బీజేపీలోకి రావాలనే ఉద్దేశం అని కేసీఆర్ ఆ పార్టీ నేతలకు హితబోధ చేశారు. మనకూ సంస్థలు ఉన్నాయని చెప్పి ఎవరూ భయపడొద్దని హామీ ఇచ్చారు. దీంతో క్యాసినో లాంటి కేసులో ఎమ్మెల్యేలు భయపడనవసరం లేదని చెప్పకనే చెప్పారని అనుకుంటున్నారు. కానీ, ఎమ్మెల్యేల్లో టెన్షన్ మాత్రం పోవడం లేదు.
ప్రజాప్రతినిధులు వారి బంధువులే టార్గెట్‌గా ఈడీ ఫోకస్ !
తెలంగాణలో అక్రమంగా సంపద రవాణా అవుతున్న విషయాన్ని ఈడీ క్షుణంగా పరిశీలిస్తోంది. ఎమ్మెల్యేల బంధువుల నుంచి కేసీఆర్ కుటుంబ బినామీల వరకు అందరిపైన డేగ కన్ను పెట్టింది. ఇప్పటి నుంచి సమాచారం సేకరించుకుని ఎన్నికల సమయానికి రంగంలో దిగేందుకు సిద్ధమౌతోందని సమాచారం. భూముల క్రయ విక్రయాలు, ధరణి ప్రైవేట్ ఆప్షన్ లో ఉన్న వారి గురించి ఆరా తీస్తున్నారట అధికారులు.
Tags : బయటపడ్డ క్యాసినో డీలర్ చికోటి ప్రవీణ్ చీకటి వ్యాపారం, చికోటి ప్రవీణ్ కస్టమర్ల లిస్ట్,టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై రాజీనామాల ఒత్తిడి, chikoti praveen,chikoti praveen kumar,chikoti praveen casino,chikoti praveen casino case,talasani srinivas yadav,chikoti praveen interview,chikoti praveen kumar casino,chikoti praveen news,chikoti praveen live,ed enquiry to minister talasani brothers in chikoti praveen casino case,chikoti praveen ed raids