ప్రగతిభవన్‌ ముట్టడికి షర్మిల ప్రయత్నం...కారులోనే నిరసన !

0


వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిలను పోలీసులు మరోసారి అరెస్ట్‌ చేశారు. నిన్న ధ్వంసమైన కారులో భారీ కాన్వాయ్‌తో లోటస్‌ పాండ్‌ నుండి ప్రగతిభవన్‌ ముట్టడికి షర్మిల యత్నించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు సోమాజిగూడ వద్ద షర్మిలను అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగారు. కారులో నుంచి దిగేందుకు షర్మిల నిరాకరించారు. డోర్‌ లాక్‌ చేసుకుని కారు లోపలే ఉండిపోయారు. దీంతో సోమాజిగూడ పరిసర ప్రాంతాలో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో పోలీసులు.. షర్మిల ఉన్న కారును క్రేన్‌ సాయంతో లిఫ్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు.

షర్మిలను పీఎస్‌లోకి తీసుకెళ్లిన పోలీసులు

షర్మిలను అరెస్ట్‌ చేయడంతో ఎస్సార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్రేన్‌ సాయంతో కారును పోలీస్‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు... అక్కడ బలవంతంగా కారు డోర్లు తెరిచారు. అనంతరం షర్మిలను పీఎస్‌ లోపలికి తీసుకెళ్లారు. మరోవైపు పోలీస్‌స్టేషన్‌కు భారీగా వైఎస్సార్టీపీ కార్యకర్తలు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పంజాగుట్టలో కేసు

షర్మిలపై పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. వీఐపీ మూమెంట్‌ ఏరియాలో ట్రాఫిక్‌ జామ్‌కు కారణమయ్యారని పోలీసులు కేసు నమోదు చేశారు. షర్మిలపై 353, 337 సెక్షన్లల కింద కేసు నమోదు అయ్యింది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !