ద్వేషంతో మనసు గాయపరచకండి - రష్మిక మందన్నా.

0


గత కొన్ని రోజులుగా లేదా వారాలు లేదా నెలలు లేదా ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా కొన్ని విషయాలు నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. వాటికి నేను సమాధానం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నాను. నేను నా కోసం మాత్రమే మాట్లాడుతున్నాను - నిజానికి ఇది కొన్ని సంవత్సరాల క్రితమే చేయవలసిన పని.

నేను నా కెరీర్‌ని ప్రారంభించినప్పటి నుండి నన్ను చాలా మంది ద్వేషిస్తున్నారు. విమర్శలు, నెగిటివిటీతో ఇబ్బంది పెడుతున్నారు. నేను ఎంచుకున్న జీవితం ఎంతో ప్రయాసతో కూడుకున్నదని నాకు తెలుసు- నేను ప్రతి ఒక్కరి ప్రేమను పొందుతానని నేను ఖచ్చితంగా అనుకోను. అలా అని నేను మీకు నచ్చలేదు అంటే దాని అర్థం...నాపై మీరు విమర్శలు చేయమని కాదు.

మిమ్మల్నందరినీ సంతోషపెట్టడానికి నేను ఎంత కష్టపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు. నేను చేసే పని వల్ల మీరు ఆనందపడితే అదే నాకు చాలు. మీరు ఆనందించేలా, గర్వించేలా పని చేయడానికి నా శాయాశక్తుల ప్రయత్నిస్తున్నాను. కానీ నేను మాట్లాడని విషయాల గురించి నాపై విమర్శలు చేయడం మాత్రం నన్ను చాలా  బాధకు గురిచేస్తోంది. అవి విన్నప్పుడు గుండె పగిలిపోయినంతగా బాధ కలుగుతోంది.

ఇంటర్వ్యూలలో నేను మాట్లాడిన కొన్ని విషయాలు తప్పుగా అర్థం అవ్వడం వలనే నాకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయని నేను గుర్తించాను. ఇంటర్నెట్‌లో వచ్చే తప్పుడు కథనాల వల్ల పరిశ్రమలో, అలాగే బయట నాకున్న మంచి సంబంధాలపై ప్రభావం పడుతుంది. సద్విమర్శలను నేను ఎప్పుడూ స్వాగతిస్తాను. ఎందుకంటే అవి నన్ను నేను మెరుగుపరచుకోడానికి ఇంధనంలా ఉపయోగపడతాయి. కానీ కొంతమంది దిగజారుడు మాటలతో నీచంగా మాట్లాడుతూ ద్వేషం వెళ్ళగక్కుతున్నారు ? చాలా కాలంగా దాన్ని పట్టించుకోకుండా ఉండిపోయాను. కానీ పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఈ విషయాన్ని ఎత్తి చూపడం ద్వారా.. నేను ఎవరిపై గెలవడానికి ప్రయత్నించడం లేదు. నాపై వస్తున్న విమర్శల కారణంగా మనిషిగా నాలో ఎటువంటి మార్పు రావాలని కోరుకోవడం లేదు. 

ఇలా చెప్పుకుంటూ పోతే.. మీ అందరూ నాపై చూపిస్తున్న ప్రేమను నేను గుర్తించి, అంగీకరిస్తున్నాను. మీరు చూపుతున్న ప్రేమ, ప్రోత్సాహం నన్ను ముందుకు నడిపిస్తోంది. అదే బయటకు వచ్చి అందరికీ తెలియజేసే ధైర్యాన్ని నాకు ఇచ్చింది. నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిపై, నేను ఇప్పటివరకు పని చేసిన వ్యక్తులపై, నాకు నచ్చిన వారందరిపై నాకు అభిమానం ఉంది. నేను కష్టపడి పని చేయడంతోపాటు మీకు మంచి జరిగేలా ప్రయత్నిస్తాను. ఎందుకంటే నేను చెప్పినట్లు.. మీరు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను. అందరూ దయగా ఉండండి. అందరం అందరికీ మంచి చేసేలా కృషి చేద్దాం. ధన్యవాదాలు’ అని రాసుకొచ్చింది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !