వైఎస్‌ వివేకా హత్య కేసు ` హైదరాబాద్‌ సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేసిన సుప్రీంకోర్టు !

0

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు తెలంగాణకు బదిలీ చేసింది. వివేకా కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్‌ పై సుప్రీంకోర్టు నేడు తీర్పును వెలువరించింది. జస్టిస్‌ ఎంఆర్‌ షా నేతృత్వంలోని ధర్మాసనం తెలంగాణకు బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చింది. అలాగే ఈ కేసులో దాఖలైన అన్ని చార్జ్‌ షీట్లను కూడా అక్కడే బదిలీ చేయాలని ఆదేశించింది. తన తండ్రి హత్య కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై అక్టోబర్‌ 19న జస్టిస్‌ ఎంఆర్‌ షా ధర్మాసనం విచారణ ముగించింది. ఈ క్రమంలోనే నేడు కడప సీబీఐ కోర్టు నుంచి హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు బదిలీ చేసింది. వివేకా కుమార్తె, భార్యకు కేసు విచారణపై అసంతృప్తి ఉన్నందున బదిలీకి ఆదేశాలిస్తున్నట్టు సుప్రీం తెలిపింది. ప్రాథమిక హక్కులను పరిగణలోకి తీసుకున్నామని సుప్రీంకోర్టు వెల్లడిరచింది. ఆధారాలను ధ్వంసం చేశారంటూ నమోదైన కుట్ర కేసును కూడా సీబీఐ విచారించాలని కోర్టు ఆదేశించింది.  ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమంటూ సుప్రీం వ్యాఖ్యానించింది. 

పలువురి ప్రముఖుల స్పందన !

‘సుప్రీం కోర్టు తీర్పు చాలా సంతోషాన్ని ఇచ్చింది’ అంటూ ఈ తీర్పు వచ్చిన తరువాత వైఎస్‌ సునీత అన్నారు. దర్యాప్తు సరిగ్గా జరగడం లేదని చెబుతూ ఆంధ్రప్రదేశ్‌ నుంచి హత్య కేసును పక్క రాష్ట్రాలకు బదిలీ చేయాలని వైఎస్‌ వివేకానంద రెడ్డి కూతురు వైఎస్‌ సునీత సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు.

నారా చంద్రబాబు నాయుడు 

ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగానే నీ సొంత బాబాయి హత్య కేసును వేరే రాష్ట్రానికి తరలించారంటూ ఏపీ సీఎం జగన్‌ను ఎద్దేవా చేస్తూ ట్వీట్‌ చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !