గవర్నర్ తమిళిసై , ప్రభుత్వం మధ్య వివాదం మరింత ముదిరింది. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డుపై ప్రభుత్వాన్ని గవర్నర్ వివరణ కోరగా, ఈ నెల 9న మంత్రి సబిత ఇంద్రారెడ్డి, మరియు ఆయా శాఖల అధికారులు రాజ్‌భవన్ వెళ్లి వివరణ ఇచ్చారు. వివరణ ఇచ్చి వారం గడిచినా నిర్ణయం మాత్రం వెలువడలేదు. ప్రభుత్వం ఇచ్చిన వివరణకు గవర్నర్ సంతృప్తి చెందలేదా ? లేక మరేదైనా కారణం ఉందా అన్నది తెలియాల్సి ఉంది. అంతే కాకుండా ఇప్పటికే గవర్నర్ దగ్గర వివిధ బిల్లులు పెండిరగ్‌లో ఉన్నాయి. మరోవైపు బిల్లులపై గవర్నర్ కావాలనే తాత్సారం చేస్తున్నారని ప్రభుత్వరు ఆరోపిస్తుంది. బిల్లు ఆమోదానికి మరింత సమయం గవర్నర్ తమిళిసై తీసుకోనున్నారు.