లిక్కర్‌ క్వీన్స్‌...

0

వీకెండ్స్‌లో చీర్స్‌ అంటూ అబ్బాయిలు చిల్‌ అవ్వటం కామన్‌. కానీ అమ్మాయిలు కూడా మేము దేనిలో తక్కువ కాదు అని ఛీర్స్‌ చెప్పటం ఈ రోజుల్లో సర్వ సాధారణంగా మారిపోయింది. ఇలాంటి సీన్స్‌ మనం కేవలం సినిమాల్లో మాత్రమే చూస్తాం. కానీ దేశ రాజధాని దిల్లీలో మద్య వినియోగం శ్రుచిమించుతోందని తాజా సర్వే వెల్లడిరచింది.

CADD సర్వే ఫలితాలు.. 

దేశంలో మద్యం వినియోగం వేగంగా పెరుగుతోందని తేలింది. దీపావళికి ముందు మూడు రోజులు అమ్మకాల షాకింగ్‌ డేటా ఇదే వెల్లడిరచింది. దిల్లీ వాసులు ఏకంగా రూ.100 కోట్లకు పైగా మద్యాన్ని తాగేశారని సర్వే వెల్లడిరచింది. అయితే ఈ విషయంలో మహిళలపై చేసిన సర్వే ప్రకారం మద్యం తాగే మహిళలు మునుపటి కంటే ఎక్కువయ్యారని తెలిసింది. సర్వేలో 5000 మంది మహిళలు పాల్గొనగా వారిలో 77 శాతం మందిని డిస్కౌంట్లు ఎక్కువగా ఆకర్షించాయని చెప్పారు.

రోజు తాగటంలో తక్కువే !  

పురుషులతో పోల్చినప్పుడు క్రమం తప్పకుండా మద్యం తాగే మహిళల సంఖ్య తక్కువగానే ఉంది. కానీ సర్వేలో పాల్గొన్నవారిలో కేవలం 7 శాతం మంది మాత్రమే మద్యాన్ని హానికరమైనదిగా, ప్రమాదకరమైనదిగా భావిస్తున్నామని అంగీకరించారు. ఇందులో వారానికి రెండు సార్లు మద్యం సేవిస్తున్నవారి సంఖ్య 38.1% ఉండగా.. వారానికి నాలుగురోజులు మద్యం తాగుతున్న మహిళల సంఖ్య 19.1% గా ఉందని సర్వే వెల్లడిరచింది. వీరిలో రోజూ 1-2 పెగ్‌లు తీసుకుంటున్న మహిళల సంఖ్య 36.7%, రోజుకు 3-4 పెగ్‌లు తీసుకుంటున్న మహిళల సంఖ్య 34.9% ఉంది. ఒకేసారి నాలుగు లేదా అంతకంటే ఎక్కువ పెగ్‌లు తాగుతున్న మహిళల సంఖ్య 28.4% గా ఉందని తేలింది. సర్వేలో పాల్గొన్నవారిలో 18-30 వయస్కులు - 1453, 31- 45 వయస్కులు - 2021, 46- 60 వయస్కులు - 1206, 60 ఏళ్ల వయస్కులు - 320 మంది మహిళలు సర్వేలో పాల్గొన్నారు.


విపరీతంగా అమ్మకాలు !

దేశరాజధాని ఢల్లీిలో రానున్న రోజుల్లో అమ్మకాలు 87% పెరుగుతాయని ఈ సర్వే అంచనా వేసింది. ఇప్పటికే విస్కీ అమ్మకాలు 59.5 శాతం పెరగగా.. బీర్‌ అమ్మకాలు 5.5 శాతం మేర పెరిగాయి. డిస్కౌంట్ల వల్ల ఎక్కువ మద్యంపై ఖర్చుచేసినట్లు 39.8% మంది చెప్పటం గమనార్హం. 34.1% మంది ఇంట్లోనే మద్యపానం చేసేందుకు ఇష్టపడుతున్నట్లు చెప్పారు. కాగా ఇదే సమయంలో 32.7% మంది మాత్రం బార్‌లు, పబ్‌లకు వెళ్లడానికి ఇష్టపడుతున్నామని వెల్లడిరచారు.

కరోనా సమయంలో...

సాధారణ సమయంలో కంటే కరోనా కాలంలో మహిళలు ఎక్కువ మద్యం సేవించారని సర్వేలో వెల్లడైంది. ఆందోళనల నుంచి బయటపడేందుకు చాలా మంది ఈ మార్గాన్ని ఎంచుకున్నారని తేలింది. మహిళల్లో 37.6 శాతం మంది తమ మద్యపానం పెరిగినట్లు CADD సర్వేలో తెలిపారు. 42.3 శాతం మంది మహిళలు సందర్భానుసారంగా మద్యపానం పెరిగిందని చెప్పారు. కరోనా తర్వాత 2022 నుంచి పరిస్థితులు సాధారణ స్థితికి రావటంతో మద్యం అమ్మకాలు పెరిగాయి.

మహిళల మాట ఇదే.. 

మహిళల్లో అతిగా మద్యం సేవించేందుకు ఒత్తిడి, ఆందోళనలే ప్రధాన కారణమని వెల్లడైంది. డేటాను పరిశీలిస్తే.. 45.7 శాతం మంది మహిళల్లో వినియోగం పెరగడానికి కారణం టెన్షన్‌ అని తేలింది. ఇది కాకుండా మద్యం సులువుగా లభించడం వల్ల కూడా వినియోగం పెరిగిందని 34.4 శాతం మంది అభిప్రాయపడ్డారు. తమలోని విసుగును అధిగమించేందుకు మద్యాన్ని సేవించినట్లు సర్వేలో పాల్గోన్న 30.1 శాతం మంది స్పష్టం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !