శీతాకాలంలో చర్మం పొడిబారుతుంది ? అయితే పట్టులాంటి చర్మం కోసం...

0

శీతాకాలపు చలిగాలి మరియు చల్లని వాతావరణం చర్మానికి చాలా హాని కలిగిస్తుంది. ఈ సీజన్‌లో చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. ఈ సీజన్‌లో చర్మంలో తేమ తగ్గి చర్మం పొడిబారడం వల్ల అనేక చర్మ సమస్యలు తలెత్తుతాయి. ఈ సీజన్లో చర్మంలో శరీరానికి అవసరమైన విటమిన్‌ ‘డి’ లేకపోవడం కూడా కారణంగా మారుతుంది. దీని ప్రభావం చర్మంపై స్పష్టంగా కనిపిస్తుంది. చలికాలంలో విటమిన్‌ ‘డి’ లేకపోవడం వల్ల చర్మం పొడిబారడం మొదలవుతుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. విటమిన్‌ డి అనేది కరిగే విటమిన్‌, ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది ముఖ్యంగా సుర్యరశ్మి నుంచి వస్తుంది. శీతాకాలంలో చర్మం పొడిని తొలగించడానికి మనం తరచుగా కాస్మెటిక్‌ క్రీములను ఉపయోగిస్తాము. దీని ప్రభావం కొంత సమయం వరకు ఉంటుంది. ఆ తర్వాత చర్మం మళ్లీ పొడిగా మారిపోతుంది. ఈ సీజన్‌లో చర్మంపై హోం రెమెడీలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. చలికాలంలో చర్మంపై తేనెను ఉపయోగించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. తేనెను చర్మానికి వాడటం వల్ల పొడిబారకుండా చేయటంతో పాటు చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. తేనె వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు, దానిని ఎలా ఉపయోగించాలో కూడా తెలుసుకుందాం.

చర్మానికి తేనె ఎలా ఉపయోగపడుతుంది

తేనె ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మానికి కూడా మేలు చేస్తుంది. యాంటీ-మైక్రోబయల్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉన్న తేనె మొటిమలు, నిర్జీవమైన, పొడి చర్మాన్ని సంరక్షిస్తుంది. చర్మంపై తేనెను ఉపయోగించడం వల్ల చర్మాన్ని లోతుగా తేమ చేస్తుంది. డ్రై స్కిన్‌ను తొలగిస్తుంది. తేనె చర్మంపై క్లెన్సర్‌గా పనిచేస్తుంది.ఇది చర్మ రంధ్రాలను క్లియర్‌ చేస్తుంది. బ్లాక్‌ హెడ్స్‌ ను తొలగిస్తుంది. తేనెలో యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ బాక్టీరియల్‌ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని ఇన్ఫెక్షన్‌ నుంచి కాపాడుతుంది. దీన్ని చర్మంపై ఉపయోగించడం వల్ల చర్మంలోని మృతకణాలను తొలిగిస్తుంది. చలికాలంలో చర్మం పొడిగా ఉంటుంది కాబట్టి చర్మం పొడిబారకుండా చేసి చర్మానికి మెరుపునిస్తుంది.

చర్మంపై తేనెను ఎలా ఉపయోగించాలి:

చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే పాలతో తేనెను కలిపి ఉపయోగించండి. ముందుగా ఒక చెంచా తేనె తీసుకుని అందులో ఒక చెంచా పాలు కలపాలి. రెండిరటినీ బాగా కలపండి. సిద్ధం చేసుకున్న పేస్ట్‌ను ముఖంపై 15-20 నిమిషాల పాటు అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. ఈ ప్యాక్‌ వల్ల చర్మం పొడిబారకుండా చేసి చర్మం నునుపుగా, ఆరోగ్యంగా మార్చుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !