పైలట్‌ రోహిత్‌రెడ్డి, రకుల్‌ ప్రీత్‌సింగ్‌కు ఈడీ నోటీసులు

1 minute read
0



ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డికి, సినీ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ నోటీసులు జారీ చేసింది. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో రకుల్‌కు ఈ నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది. ఈనెల 19న విచారణకు హాజరుకావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.


గత ఏడాది సెప్టెంబర్‌ 3 వ తేదీన రకుల్‌ను ఈడీ అధికారులు విచారించారు. ఈ సమయంలో అత్యవసరంగా వెళ్ళవలసి ఉందని విచారణ మధ్యలోనే రకుల్‌ వెళ్ళిపోయారు. దీంతో ఈడీ అధికారులు పూర్తిస్థాయిలో విచారించలేకపోయారు. ఈ నేపథ్యంలో రకుల్‌ను మరోసారి విచారణకు రావాలని నోటీసులు అందించారు. మరోవైపు ఈడీ నోటీసులపై ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి స్పందించారు. ఈడీ నోటీసులు అందాయని తెలిపారు. తన వ్యాపారాలు, కంపెనీలకు సంబంధించిన వివరాలు అడిగారని చెప్పారు. 19న ఈడీ విచారణకు హాజరవుతానని చెప్పారు. 2021 ఫిబ్రవరిలో కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్మాత శంకర గౌడ ఇచ్చిన పార్టీకి పలువురు ఎమ్మెల్యేలు, వ్యాపారులు హాజరయ్యారు. రియల్టర్‌ సందీప్‌ రెడ్డి, హీరో తనీష్‌ కూడా హాజరయ్యారు. నాటి పార్టీలో 4 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ ఉపయోగించారని పోలీసులకు సమాచారం అందింది. ఈ పార్టీకి సంబంధించి ఇద్దరు నైజీరియన్లను ఫిబ్రవరి 26న కర్ణాటక పోలీసులు అరెస్ట్‌ చేశారు. పట్టుబడిన డ్రగ్స్‌తో పైలట్‌ రోహిత్‌ రెడ్డికి సంబంధాలున్నాయని బెంగళూరు పోలీసులు అనుమానిస్తున్నారు. భారీగా నగదు చేతులు మారిన నేపథ్యంలో కేసును ఈడీకి అప్పగించారు. ఈ నేపథ్యంలోనే రోహిత్‌ రెడ్డికి నోటీసులు అందినట్లు భావిస్తున్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
January 5, 2025