దివికేగిన నవరస నటసార్వభౌముడు...కైకాల సత్యనారాయణ కన్నుమూత !

0

సీనియర్‌ హీరో కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గతకొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపుతున్నారు. నిన్న రాత్రి వరకు ఆయనకు ఇంటిదగ్గరే చికిత్స అందించారు వైద్యులు. కొద్దిసేపటి క్రితమే ఆయన కన్ను మూశారు. కైకాల సత్యనారాయణ దాదాపు 770కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. విలన్‌గా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మెప్పించారు. కైకాల సత్య నారాయణ మరణ వార్త తెలిసి టాలీవుడ్‌ విషాదంలో మునిగిపోయింది. కైకాల సత్యనారాయణ తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారు. 87ఏళ్ల సత్యనారాయణ 60 ఏళ్ల సినీజీవితాన్ని అనుభవించారు.

సీనియర్‌ హీరో ఎన్టీఆర్‌కు డూప్‌గా నటించారు. కామెడీ విలన్‌ గాను మెప్పించారు. తన సినీ కెరీర్‌లో కైకాల సత్యనారాయణ ఏడు వందలకు పైగా సినిమాల్లో నటించాడు. విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రకరకాల పాత్రల్లో మెప్పించాడు. వయోభారంతో కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కైకాల సత్యనారాయణ ఒకప్పుడు రమా ఫిలింస్‌ అనే బ్యానర్‌తో సినిమాలను కూడా నిర్మించారు. కైకాల సత్యనారాయణ తర్వాత ఆయన వారసుడు.. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన శాండిల్‌వుడ్‌లో నిర్మాణరంగంలో కూడా ఉన్నారు.

హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా, కమెడియన్‌గా ఇలా అన్ని రకాల పాత్రలను పోషించి తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. 770 చిత్రాల్లో నటించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తింపుగా ‘నవరస నటనా సార్వభౌమ’ అనే బిరుదు పొందారు.. టాలీవుడ్‌లో ఎస్‌.వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో కైకాల ఒకరు. ఆయన మరణ వార్తతో టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించేందుకు పలువురు సినీ ప్రముఖులు ఆయన ఇంటికి వస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !