తన రాజకీయ భవిష్యత్తుపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ స్పష్టతనిచ్చారు. విశాఖ నుంచే పార్లమెంట్‌కు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. మన రాజకీయ వ్యవస్థలో స్వతంత్రంగా పోటీ చేసే అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ‘‘నేను ఏ ప్రాంతం నుండి పోటీ చేస్తానో, ఏ పార్టీ నుంచో పోటీ చేస్తానో... అని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. నేను విశాఖపట్నం పార్లమెంట్ నుండే పోటీలో ఉంటాను, కానీ నా భావాలకు అనుగుణంగా ఉన్న పార్టీ వైపు ఉంటాను’’ అని చెప్పిన లక్ష్మీనారాయణ ఏ పార్టీ నుండి పోటీ చేస్తారో అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. గత ఎన్నికల్లోనే బాండ్ పేపర్ రాశానని... తాను అనుకున్నది చేయలేకపోతే క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పానని తెలిపారు.