తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ‘భారత్ రాష్ట్ర సమితి’గా ఆమోదిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్‌కు లేఖ అందింది. పేరు మార్చాలంటూ కేసీఆర్ చేసిన విన్నపాన్ని జాతీయ ఎన్నికల కమిషన్ ఆమోదించిందని, త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయనుందని ఆ లేఖలో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌గా పేరు మార్చేందుకు ఎన్నికల కమిషన్ ఆమోదం పలకడంతో శుక్రవారం(డిసెంబర్ 9) మధ్యాహ్నం 1.20 నిమిషాలకు ‘భారత రాష్ట్ర సమితి’ ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా కేసీఆర్ బీఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరిస్తారు.