ఫోన్‌ ట్యాపింగ్‌పై సంచలనం...సాక్ష్యాలు బయటపెట్టిన కోటంరెడ్డి !

0


కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నంత పని చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలపై సాక్ష్యాలను ప్రజల ముందుంచారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ సీతారామాంజనేయులు ( 98499 66000)  తన స్నేహితులతో మాట్లాడిన విషయాలపై ఆరా తీశారని, తన స్నేహితుడితో మాట్లాడిన ఆడియో పంపారన్నారు. ఐఫోన్‌లో కాల్‌ రికార్డింగ్‌ ఫెసిలిటీ ఉండదని గ్రహించినట్లు చెప్పారు. ట్యాపింగ్‌ జరిగిందనటానికి ఇంతకు మించిన సాక్ష్యం ఇంకేం కావాలన్నారు. ప్రభుత్వ పెద్దల అండ లేకుండా అధికారులు ఇలాంటి సాహసం చేయరని, దీనికి ప్రభుత్వ పెద్దల సహాకారం ఉందని తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. మనసు ఒకచోట.. శరీరం మరోచోట ఉండటం నాకిష్టం లేదు. అన్నా.. జగనన్నా.. నీ ఫోన్‌ ట్యాప్‌ చేస్తే ఎలా ఉంటుంది.’’ అంటూ తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. 

గత కొన్ని రోజులుగా ఇంటెలిజెన్స్‌ అధికారులు నాపై నిఘాపెట్టారు. అధికార పార్టీ నేతలపై నిఘా ఎందుకని బాధపడ్డా. నా ఫోన్‌ ట్యాప్‌ అవుతోందని 4 నెలల ముందే ఓ ఐపీఎస్‌ అధికారి చెప్పారు. సీఎంపై కోపంతో ఆ అధికారి అబద్ధం చెప్పారని భావించా. గత కొన్ని రోజులుగా ఇంటెలిజెన్స్‌ అధికారులు నాపై నిఘా పెట్టారు. అనుమానం ఉన్నచోట ఉండాలని నాకు లేదు. నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేయాలని లేదు. ఆ పార్టీ నుంచి పోటీకి నా మనసు అంగీకరించడం లేదు. నన్ను సంజాయిషీ అడగకుండానే నాపై చర్యలు చేపట్టారు.

నేను ఆధారాలు బయటపెడితే ఇద్దరు ఐపీఎస్‌ అధికారులకు ఇబ్బంది అవుతుంది. నిన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌ జరగలేదని చెప్పారు. పార్టీ నుంచి వెళ్లేవాళ్లు వెళ్లొచ్చని ఆయన అన్నారు. బాలినేని మాటలను సీఎం మాటలుగా భావిస్తున్నా. మంత్రులు, జడ్జిలు, మీడియా ప్రతినిధుల ఫోన్లు కూడా ట్యాప్‌ అయిండొచ్చు. 

రెండు రోజుల క్రితం తమ ప్రభుత్వమే తన ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తుందన్న విషయాన్ని రెండు రోజుల క్రితం బయటపెట్టిన ఆయన.. ఇక వైకాపాలో ఇమడలేనంటున్నారు. తన కార్యకర్తలతో సమావేశం సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో ఒకటి మంగళవారం బయటకొచ్చింది. అందులో.. ‘నా ఫోన్‌ ట్యాపింగ్‌ జరుగుతోంది.. దీనికి సంబంధించిన సాక్ష్యాన్ని మీరంతా చూడాల్సిన అవసరం ఉంది. వీటిని ఎందుకు బయట పెట్టలేదని మీరు అనొచ్చు.. ఎన్నికల్లో పోటీకి వైకాపా నాకు రెండు సార్లు అవకాశమిచ్చింది. ఇప్పుడు ఆ పార్టీతో వద్దనుకుంటున్నాం. నమ్మకం లేని పార్టీలో ఎక్కువ రోజులు ఉండలేం. మీ అందరి సహకారంతో 2024లో నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేస్తా’ అని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యాఖ్యానించినట్లు ఆడియోలో ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !