బ్రాండ్స్‌ అంటే కొంటున్నారా ? ఐతే మీరు మోసపోతున్నట్లే ?

0


  • బ్రాండ్స్‌ పేరుతో భారీ మోసం ! 
  • పట్టించుకోని బ్రాండ్స్‌ ప్రతినిధులు ! 
  • ఇబ్బడిముబ్బడిగా అమ్మకాలు !

అపార్ట్‌మెంట్‌లో ఉండే రూమ్స్‌లో షాపింగ్‌ చేస్తున్నారా ? బ్రాండ్స్‌ని స్మగ్లింగ్‌ చేస్తున్నాము అంటే నమ్ముతున్నారా ? బ్రాండ్స్‌ ఫస్ట్‌ కాపీ అంటే నిజంగా ఓరిజినల్‌ బ్రాండ్‌ వాళ్ళే మరొక క్వాలిటీ తయారు చేస్తారు అని విశ్వసిస్తున్నారా ? అయితే మీరు కచ్చితంగా మోసపోతున్నారు. నిలువునా నయవంచనకు గురవుతున్నారు. తస్మాత్‌...జాగ్రత్త.  భాగ్యనగరంలోని ప్రతి ఏరియాలో ఇలాంటి షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తూ, మాయమాటలతో మభ్యపెడుతూ, ప్రభుత్వానికి ట్యాక్స్‌ ఎగవేతకు పాల్పడుతూ, యదేచ్ఛగా చీకటి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. 

మోసపోతున్న యువత !

తక్కువ ధరకే బ్రాండెడ్‌ దుస్తులు మరియు యాక్ససరీర్‌ అంటే అక్కడ వాలిపోయే నేటి యువత బలహీనతను ఆసరా చేసుకుని కొంత మంది స్మగుల్‌ గూడ్స్‌ పేరుతో, బ్రాండ్స్‌ ఫస్ట్‌ కాపీ పేరుతో మోసగిస్తున్నారు.  చిన్న చిన్న కాలనీలలో అపార్ట్‌మెంట్స్‌ లేదా ఇండిపెండెంట్‌ ఇళ్ళలో డబుల్‌ బెడ్‌రూమ్స్‌ లేదా ట్రిపుల్‌ బెడ్‌రూమ్స్‌ను అద్దెకు తీసుకుని తక్కువ ధరకే బ్రాండ్స్‌ అంటూ మౌత్‌ పబ్లిసిటీతో నమ్మబలుకుతున్నారు. ఇలాంటి మోసాలకు పాల్పడే వారు హైదరాబాద్‌లోని అన్ని ఏరియాల్లో దందాలు కొనసాగిస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఇలా  షాపింగ్‌ చేసి మోసపోయారా ? జాగ్రత్త సుమీ. 

బ్రాండ్స్‌పై అవగాహనా లోపం !

ఒక ప్రముఖ బ్రాండ్‌ ఏరియా మేనేజర్‌ని కలిసి వివరణ అడిగినప్పుడు ఆయన చెప్పినది ఏమిటంటే... బ్రాండ్‌ విలువ ఉన్న కంపెనీ ఎప్పుడూ హై క్వాలిటీ గల దుస్తులను మాత్రమే (షర్ట్స్‌, ప్యాంట్స్‌, టీషర్ట్‌, జీన్స్‌ , షూస్‌,  బెల్ట్స్‌..పలు రకాలు) తయారు చేస్తుంది. ఫస్ట్‌ కాపీ (ఫస్ట్‌ క్వాలిటీ) లేదా సెకెండ్‌ క్వాలిటీ అనే మాటే ఉండదు. ఎందుకుంటే ప్రతి ఐటమ్‌పై ఒక ప్రత్యేక కోడ్‌ను ముద్రిస్తుంది. ఆ కోడ్‌ను గమనిస్తేనే ఒరిజినల్‌ అని తెలుస్తుంది. మరోక విషయం ఏమిటంటే బ్రాండెడ్‌ వస్తువులు అనేవి కేవలం తన ప్రాంచైజీలకు మాత్రమే ఐటమ్స్‌ పంపుతుంది. వేరే ఎక్కడ దొరకవు. పాడైపోయినవి, డ్యామేజ్‌ అయినవి అనే మాటే ఉండదు. ఒక వేళ విపత్తుల సమయంలో అలాంటివి జరిగితే వాటిని తిరిగి కంపెనీలోనే డ్యామేజ్‌ ఐటమ్స్‌ క్రింద పరిగణించి, వాటిని నాశనం చేస్తారు తప్పించి ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్లోకి వదలరు.  అలా దుస్తులకు విక్రయిస్తున్నారు అంటే అవి పూర్తిగా నకిలీవి అని కష్టమర్లు అర్థం చేసుకోవాలి అని ఆయన వివరించారు.



నకిలీ దుస్తులు ఎక్కడి నుండి వస్తున్నాయి. 

అసలీ ఫస్ట్‌కాపీ నకిలీ దుస్తులు ఎక్కడ నుండి వస్తున్నాయో తెలుసా. ముంబాయి, ఢల్లీి, సూరత్‌ వంటి ప్రధాన నగరాల్లోని దుస్తుల తయారీ దారులతో డైరెక్ట్‌ కాంటాక్ట్‌తో రైలు, లారీ ట్రాన్స్‌పోర్ట్‌ల ద్వారా పెద్ద మొత్తంలో తీసుకువస్తారు. ఏ ఐటమ్‌ అయినా వీరికి కేవలం 280 /` లకే లభిస్తుంది. నకిలీ బ్రాండ్స్‌ అమ్మే వారు వాటిని 700 నుండి మొదలుకొని రూ. 900/` వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. 

సోదాలు లేవు !

బ్రాండ్స్‌కి సంబంధించి ప్రతి కంపెనీ నకిలీ బ్రాండ్స్‌ అమ్ముతూ కంపెనీ విలువను దెబ్బతీస్తున్నందుకు గాను అప్పుడప్పుడు సోదాలు నిర్వహిస్తుంది. ఇప్పుడు బ్రాండ్స్‌ ప్రతినిధులు సరిగా సోదాలు నిర్వహించటక పోవటం వలన ఈ నకిలీ బ్రాండ్స్‌ అమ్మేవారు ఎక్కువైపోయారు. ప్రతి చోట నకిలీవే దర్శనం ఇస్తున్నాయి. గౌరవానికి చిహ్నామైన వస్త్రాల విషయంలోనూ దగా చేస్తున్న వారి పట్ల మనమే జాగ్రత్త పడాలి. ఇప్పటి దాకా మోసపోయింది చాలు. ఇకనైనా మీ డబ్బులకు సరైన క్వాలిటీ ఉన్న వస్త్రాలు కొనుక్కొండి. ఎందుకంటే డబ్బులు ఎవరికీ ఊరికే రావు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !