మెడికో ప్రీతి కన్నుమూత !

0

సీనియర్‌ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి కన్నుమూసింది. 5 రోజుల క్రితం పాయిజన్‌ ఇంజెక్షన్‌ తీసుకున్న ప్రీతి.. హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. బ్రెయిన్‌ డెడ్‌ తో ఆదివారం రాత్రి 9.10 గంటలకు ప్రీతి చనిపోయినట్లు నిమ్స్‌ డాక్టర్లు ప్రకటన విడుదల చేశారు. కాకతీయ వైద్యకళాశాలలో పీజీ మత్తు వైద్యం (అనస్థీషియా) మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని సీనియర్‌ పీజీ విద్యార్థి సైఫ్‌ కొన్నాళ్లుగా వేధిస్తుండడంతో తాళలేక ఆమె హానికరమైన ఇంజెక్షన్‌ చేసుకుని బలవన్మరణానికి యత్నించారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ప్రీతికి.. తొలుత వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స అందించి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకొచ్చారు. ఆమె ప్రాణాలు కాపాడేందుకు నిమ్స్‌ వైద్యుల బృందం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. కాగా, మృతురాలిని వేధించిన సీనియర్‌ సైఫ్‌ ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేశారు.



ఈ మేరకు సంతాప ప్రకటన విడుదల చేశారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు. ’’మృత్యువుతో పోరాడుతూ డాక్టర్‌ ప్రీతి తుది శ్వాస విడవడం అత్యంత బాధాకరం. ఆమెను కాపాడేందుకు నిమ్స్‌ వైద్య బృందం నిర్విరామంగా, శక్తి వంచన లేకుండా శ్రమించింది. పూర్తి ఆరోగ్యవంతురాలై వస్తుందని అనుకున్నా. డాక్టర్‌ ప్రీతి, తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడం నా మనసును తీవ్రంగా కలిచి వేసింది. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది’’.


Tags : medical student preethi,medical student preethi incident,medical student preethi news,medico preethi case,medical student preethi father,kmc student preethi issue,medico student preethi,medical student preeti,medical student preethi father emotional,medical student preethi health updates,warangal student preethi,medico student preethi sucide,kmc student preethi issue latest news,medical student preeti saif whatsapp chat,warangal pg student preeti medical report

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !