యువత గుండె ఎందుకు ఆగిపోతుంది ?

0


వయసుతో సంబంధం లేకుండా గుండెలు ఆగిపోతున్నాయి ! చిన్న వయసులోనే గుండెపోటుకు గురవ్వటం దేనికి సంకేతం ? అసలు గుండె ఎందుకు మొరాయిస్తోంది. బంధువుల పెళ్లి బరాత్‌లో డ్యాన్స్‌ వేస్తూ ఉన్నట్టుండి ఒకరు కుప్పకూలిపోవటం, జిమ్‌ చేస్తూ గుండెపోటుకు గురై ఒకరు తనువు చాలించటం, బస్టాప్‌లో నిలుచున్న వ్యక్తి ఉన్నట్టుండి కళ్ళుతిరిగి పడిపోయి చనిపోవటం...గత కొంతకాలంలా మనం నిత్యం వింటున్న వార్తలు. నిన్నటి దాకా మన మధ్య ఉండి సడన్‌గా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతే ఆ కుటుంబం పడే బాధ వర్ణణాతీతం. అప్పుడు ఆ కుటుంబానికి దిక్కెవరు ? యువతా ఆలోచించు ? 

ఆహారపు అలవాట్లు దెబ్బతీస్తున్నాయా ? 

ధూమపానం, మద్యపానం, అధిక బరువు, రక్తపోటు, వంశపారంపర్య లక్షణాలు ఉన్నవారికే గుండెపోట్లు వచ్చేవి. అదీ కూడా వయసు మళ్ళిన తరువాత రావటం చూశాం. కానీ ఇప్పుడు పై వేవీ లేకున్నా వయసుతో సంబంధం లేకుండా గుండె పోటుకు గురవుతోంది. క్షణాల్లో ప్రాణాలను కబళించేస్తోంది. అప్పటి దాకా మనతో కలిసి ఉన్న మనిషి ఒక్కసారిగా కుప్పకూలిపోయి మరణించడాన్ని జీర్ణించుకోవడం కష్టమవుతోంది. కాలానుగుణంగా మనిషి జీవనశైలిలో మార్పుల కారణంగానే నేటి ఈ గుండెపోట్లకు గురవుతున్నామా అంటే కాదు అనలేని పరిస్థితులను ఎదుర్కొంటున్నాము.  రాత్రి రెండు గంటల దాకా మేల్కొని ఉండటం, ఉదయం పది దాకా పడుకోవడం, జంక్‌ ఫుడ్‌, మద్యం, దూమపానం చేయడం వల్ల శరీరంలో జీవక్రియలు అదుపు తప్పుతున్నాయి. వ్యాయామం చేయకపోవడం, సూర్య కిరణాలు శరీరానికి తాకకపోవడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పైగా రాత్రి పొద్దు పోయిన తర్వాత ఆహారం తీసుకోవడం వల్ల శరీరం అదుపు తప్పుతోంది. అకస్మాత్తుగా గుండె పోటు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ తీవ్రమైన గుండె పోటు రావడం పట్ల వైద్యులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యువత ఉద్రిక్తలకు లోను కావొద్దని సూచిస్తున్నారు. ఉద్రిక్తతలే ఒత్తిడిని పెంచుతున్నాయని, ఇది అంతిమంగా గుండె మీద ప్రభావం చూపిస్తోందని అంటున్నారు. అది తీవ్రమైన గుండెపోటుకు దారి తీస్తోందని, అందువల్లే మనిషి కుప్ప కూలిపోతున్నాడని వివరిస్తున్నారు. 



వ్యాక్సిన్‌లే కారణమా ? 

కోవిడ్‌ మొదటి, రెండు దశల్లో చాలా మంది గుండెపోటుతోనే కన్నుమూశారు. అప్పట్లో కోవిడ్‌ బారిన పడిన చాలా మందిని కాపాడేందుకు వైద్యులు రెమిడెసివీర్‌ ఇంజక్షన్లు వేశారు. దీని వల్ల తర్వాత కొందరిలో బ్లాక్‌ ఫంగస్‌ వంటి లక్షణాలు కన్పించాయి. కొందరు కన్నుమూశారు కూడా. అయితే మన దేశంలో కోవిడ్‌ తగ్గుముఖం పట్టిన తర్వాత ఇప్పుడు గుండె పోటు రూపంలో సరికొత్త సమస్య ఎదురవుతోంది. చూసేందుకు బక్క పలచగా ఉన్నా, వయసు వ్యత్యాసం లేకుండా వ్యక్తులు గుండె పోటుకు గురై అకస్మాత్తుగా కన్నుమూస్తున్నారు. అయితే కోవిడ్‌ రెండో దశలో ప్రభుత్వం వ్యాక్సిన్లు వేసింది. దీని వల్ల చాలా మంది విభిన్నమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అలసట, ఊరికే చెమటలు పట్టడం, వాతావరణంలో చిన్నపాటి మార్పులు ఏర్పడినా అనారోగ్యానికి గురికావడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయని అప్పట్లో ప్రచారం జరిగితే ప్రభుత్వం కొట్టి పారేసింది. కానీ ఇప్పుడు కొందరు వైద్యులు మాత్రం ప్రస్తుత పరిస్థితులకు కోవిడ్‌ వ్యాక్సినే కారణమని చెబుతున్నారు.



సేంద్రియ పంటల వైపు అడుగులు ! 

పూర్వం పంటలకు చీడపీడలు పట్టినప్పుడు ఎలాంటి పురుగుమందులు వాడే వారు కాదు, నేడు ప్రతి పంటపై ఇబ్బడిముబ్బడిగా పురుగు మందులు వాడకం వలన పురుగు మందుల అవశేషాలు పంటలపై అలాగే ఉంటున్నాయి. వాటినే మనం కొనుక్కొని తింటున్నాం. మరోవైపు కల్తీ ఆహార పదార్థాలు...పాలు, నీళ్ళు, నూనె, మాంసం...కాదేదీ కల్తీకి అనర్హం. వీటిని మనం గుర్తించి కట్టడి చేయాలి. ప్రతి ఒక్కరు అవగాహనతో ముందుకు సాగాలి. అప్పట్లో ఉదయాన్నే లేవడంతో సూర్య కిరణాలు శరీరం మీద పడటం వల్ల డీ విటమిన్‌ అందేది. శరీరంలో ఎదుగుదల ఉండేది. ఇప్పుడు కాలచక్రానికి వ్యతిరేకంగా పని చేయడం, వేళాపాళా లేని ఆహారపు అలవాట్ల వల్ల శరీరం పూర్తిగా మారిపోతోంది. అందుకే ఉదయం తొందర లేవాలి. రాత్రి తొందర పడుకోవాలి. జంక్‌ ఫుడ్‌ పూర్తిగా మానేయాలి. ఒక్కసారి వాడిన నూనె మళ్లీ వాడకూడదు. రాత్రి పూట అన్నానికి బదులు గోధుమ, జొన్న రొట్టెలు తీసుకోవాలి. మాంసాహారాన్ని మితంగా తీసుకోవాలి. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో తృణధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. చెమట వచ్చేలా పని చేయాలి. నడక లేదా పరుగు లాంటివి చేయాలి. అప్పుడే శరీరంలో జీవక్రియల రేటు బాగుంటుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !