ప్రతి రోజు ఉదయాన్నే మనం పళ్ళు తోముకోవడానికి టూత్ పేస్ట్ ని ఉపయోగిస్తూ ఉంటాము. అయితే టూత్ పేస్ట్ ట్యూబ్ బయట ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో పాటు క్రింద ఒక చిన్న కలర్‌తో కూడిన చతురస్రాకారంలో ఉంటే చిన్న బాక్స్ ఉంటుంది. ఒక్కొక్క దానికిఒక్కొక్క కలర్‌ని మనం గమనించవచ్చు. టూత్ పేస్ట్ మీద మాత్రమే కాదు. ఫేస్ క్రీమ్స్, ఆయింట్మెంట్స్ వంటి వాటి ట్యూబ్‌ల మీద మనకి కలర్స్ దర్శనమిస్తూనే ఉంటాయి.
మనం కొంచం పరీక్షగా చేస్తే నలుపు రంగు, నీలం రంగు, ఎరుపు రంగు, ఆకు పచ్చ రంగులో ఉంటాయి. అయితే అవి ఎందుకు వేస్తారో మీకు తెలుసా ? అందమైన ప్యాకింగ్ కోసమా, ఆకర్షణీయంగా కనపడటం కోసమా అనుకుంటే పొరపాటే.
మామూలుగా టూత్ పేస్ట్‌లని మెడిసిన్స్, సహజ పదార్థాలని ఉపయోగించి తయారు చేయడం జరుగుతుంది. అయితే ఈ రంగులని బట్టీ మనం టూత్ పేస్ట్ ని ఎలా తయారు చేశారు అనేది ఇట్టే గుర్తు పట్టవచ్చు ? ఏం వేశారు అనేది చెప్పలేము. మనం ఏ పదార్ధాలని వాడారు అనేది కేవలం టూత్ పేస్ట్ ట్యూబ్ మీద రాసి ఉంటుంది కదా అలానే తెలుసుకోగలము. అంతే కానీ ట్యూబ్ మీద వుండే కలర్ ని బట్టీ కాదు.
ఇక విషయానికి వస్తే.. పేస్ట్ ట్యూబ్ మీద ఆకుపచ్చ రంగు బాక్స్ కనుక వుంటే అది న్యాచురల్. అదే పేస్ట్ ట్యూబ్ మీద నీలం ఉంటే న్యాచురల్ మరియు మెడికేటెడ్. ఒకవేళ కనుక ఎరుపు రంగు ఉంటే న్యాచురల్ మరియు కెమికల్ కాంపోజిషన్ కలిగి ఆ పేస్ట్ ఉందని అంటారు. ఒకవేళ కనుక బ్లాక్ కలర్ వుంది అంటే మొత్తం కెమికల్స్ తో నిండి ఉందని చెబుతూ ఉంటారు.