టీడీపీలో చేరిన మహాసేన రాజేష్‌ !

0


ఆంధప్రదేశ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దళిత నేతగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న మహాసేన రాజేశ్‌ తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు తన పర్యటనలో భాగంగా సామర్లకోటలోని దళిత సామాజికవర్గంతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో మహాసేన రాజేశ్‌ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు రాజేశ్‌కు  పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు చంద్రబాబు. అయితే గత కొంతకాలంగా మహాసేన రాజేశ్‌ ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ అయిన వైసీపీ ప్రభుత్వ విధానాలను సోషల్‌ మీడియా వేదికగా విమర్శిస్తుండడం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు టీడీపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చీకటి వచ్చిన తర్వాతే వెలుగు విలువ తెలుస్తుందని, జగన్‌ అస్తవ్యస్త పాలన చూశాక చంద్రబాబు పాలన ఎంత గొప్పదో అర్ధమవుతోందని వ్యాఖ్యానించారు.

జగన్‌ 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబును దళితద్రోహిగా పేర్కొన్నారని, తాము కూడా జగన్‌ మాటలు నిజమే అని భావించామని, కానీచాలా కొద్ది కాలంలోనే నిజమైన దళిత ద్రోహి ఎవరో గుర్తించామని మహాసేన రాజేశ్‌ పేర్కొన్నారు. జగన్‌ మాటలు నమ్మి చంద్రబాబును అపార్థం చేసుకున్నామని విచారం వ్యక్తం చేశారు. ఎస్సీలకు 27 పథకాలు అమలు చేసిన వ్యక్తి చంద్రబాబు అని, దళితులు ఆత్మాభిమానంతో బతికేలా చేసేందుకు ఎన్నో చర్యలు చేపట్టారని కొనియాడారు రాజేశ్‌. అయితే జగన్‌ రాగానే ఆ పథకాలను రద్దు చేశారని ఆయన ఆరోపించారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !