కడప యంపీ స్థానంలో సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ?
తీవ్రంగా పరిశీలిస్తున్న టీడీపీ అధిష్టానం !
వివేకా హత్య కేసులో సునీతకు కోర్టులో న్యాయం జరిగినా, జరగకపోయినా ప్రజాక్షేత్రంలో న్యాయం జరగాలని టీడీపీ అధినాయకత్వం కోరుకుంటుంది. వివేకా కూతురు డాక్టర్ సునీతను పులివెందుల ఎమ్మేల్యేగా పోటీ చేయించాలని భావిస్తోంది. ప్రజాక్షేత్రంలోనే తండ్రి మరణానికి బాధ్యులైన వారికి శిక్ష పడేలా చేయటంతో పాటు అధికారం మదంలో ఏదైనా చేయవచ్చు అనుకునే వారి అహం అణచివేయాలని టీడీపీ భావిస్తోంది. అలాగే సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి కూడా కడప యంపీ స్థానంలో పోటీ చేసే అవకాశాల్ని పరిశీలిస్తోంది. డాక్టర్ సునీత పోరాట ఫలితంగా వైఎస్ వివేకా మరణంపై ఉన్న అనుమాలకు ఒక్కొక్కటిగా సమాధానం వస్తోందని టీడీపీ భావిస్తోంది. విపక్షంలో ఉండగా తెలుగుదేశంపై ఆరోపణలు గుప్పించిన జగన్.. అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కేసు ఎప్పటికీ తేలకుండా ఉండేలా అడుగులు వేశారు. విపక్షంలో ఉండగా సీబీఐ దర్యాప్తు అంటూ డిమాండ్ చేసిన ఆయన అధికారంలోకి వచ్చాకా సీబీఐ దర్యాప్తు అవసరం లేదని అన్నారు. సునీత గట్టిగా నిలబడి ఉండకపోతే ఏం జరిగేది? ఈ కేసు ఎప్పటికీ పరిష్కారమయ్యేది కాదు. లేకుంటే టీడీపీ పార్టీ పరంగా, చంద్రబాబు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తాలుకు అపవాదును మోయవలసి వచ్చేది. ఆమె పోరాటం ఫలితంగానే టీడీపీకి మేలు జరిగింది అన్నది కాదనలేని వాస్తవం. డాక్టర్ సునీత పోటీ చేస్తారా లేదా అనే అంశం ఎన్నికల సమయానికి మరింత స్పష్టత వస్తుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.