విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 ఘనంగా ప్రారంభమైంది. దేశ, విదేశీ కార్పోరేట్ దిగ్గజాలన్నింటినీ ఒకే వేదికపై తీసుకురావడమే లక్ష్యంగా ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ పచ్చదనం, పారిశ్రామిక రవాణా మౌలిక వసతులు, డిజిటలైజేషన్, ఆంట్రపెన్యూర్‌షిప్.. రాష్ట్ర పారిశ్రామిభివృద్థికి మూల స్తంభాల్లాంటివని అభివర్ణించారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని సీఎం జగన్ కొనియాడారు. మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్న ఏకైక రాష్ట్రమని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పరిశ్రమల అవసరాల్ని తీర్చేలా అంతర్జాతీయ స్థాయిలో 26 నైపుణ్య కాలేజీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రాష్ట్రంలో సుస్థిరమైన అభివృద్ధి జరగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకోసం రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలిని పిలుపునిచ్చారు. ఏ సమస్య ఉన్న, ఎలాంటి అసౌకర్యం కలిగినా కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలోనే అందుబాటులో ఉంటామని అన్నారు. అలాగే, త్వరలో విశాఖ ఎగ్జిక్యూటివ్‌గా రాజధానిగా అవుతుంది. త్వరలో విశాఖ నుంచే పరిపాలన సాగిస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రానికి రూ.13లక్షల కోట్ల పెట్టుబడులుWe have received 340 investment proposals worth Rs 13 lakh crores, providing employment to 6 lakh people across 20 sectors! #AdvantageAP #APGlobalInvestorsSummit2023 #AndhraPradesh pic.twitter.com/FQBHVm20Sj
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 3, 2023
ఏపీకి రూ.13లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని గర్వంగా చెబుతున్నాను. 340 సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు వచ్చాయి. తొలిరోజు 92 ఎంవోయూలు రాగా మొత్తం 340 ఎంవోయూలు.. దీని ద్వారా 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దేశ ప్రగతిలో ఏపీ కీలకంగా మారింది. 20 రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఏపీలో కీలక రంగాల్లో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకువచ్చాము.