బాధ్యతాయుతమైన గురువు స్థానంలో ఉండి పదో తరగతి చదువుతున్న విద్యార్థికి ప్రేమపాఠాలు నేర్పింది ఓ టీచరమ్మ. ఇదీ చాలక ఎవరికీ తెలియకుండా అతడిని తీసుకుని అదృశ్యమైన సంఘటన చందానగర్, గచ్చిబౌలి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. దీనికి వారు పెట్టుకున్న పేరు ప్రేమ. టీచర్‌కు, స్టూడెంట్‌కి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని తెలిసింది. టీచర్‌కు పెళ్ళిసంబంధాలు చూస్తున్నారని తెలిసి, ఇది నచ్చని టీచర్ స్టూడెంట్‌ను తీసుకుని వెళ్ళిపోయి రెండు రోజుల అనంతరం తిరిగివచ్చినట్లు తెలిసింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చందానగర్‌లో నివసించే ఓ మహిళ (26) ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పని చేస్తోంది. గచ్చిబౌలికి చెందిన ఓ విద్యార్థి (15) ఇదే పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. కాగా ఫిబ్రవరిలో.. సదరు మహిళా టీచర్ తాతయ్య.. తన మనమరాలు కల్పించడం లేదంటూ చందానగర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశాడు.
ఆ తర్వాత రెండు రోజులకి తన మనవరాలు తిరిగి వచ్చిందని కేసు విత్ డ్రా చేసుకున్నాడు. ఈ క్రమంలోనే.. సరిగ్గా టీచర్ అదృశ్యమైన రోజుల్లోనే తమ కొడుకు కూడా కనిపించడం లేదంటూ 10వ తరగతి విద్యార్థి తల్లిదండ్రులు కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రెండు రోజులకు అతను కూడా తిరిగి వచ్చాడంటూ వారు కూడా కేసు విత్ డ్రా చేసుకున్నారు. విద్యార్థిని పోలీసులు ఎక్కడికి వెళ్లావు అని కూపీలాగారు. దీంతో ఆ విద్యార్థి చెప్పిన విషయం విని తల్లిదండ్రులు, పోలీసులు షాక్ అయ్యారు. తాను తన స్కూల్లోని మహిళా టీచర్‌తో కలిసి ఫిబ్రవరి 16వ తేదీన వెళ్లినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు టీచర్ని పిలిచి విషయం కనుక్కున్నారు. నిజమే అని తేలింది. దీంతో టీచర్ కు, విద్యార్థికి కౌన్సిలింగ్ ఇచ్చారు.