లిక్కర్‌ స్కామ్‌లో కవితక్కే కీలక సూత్రదారి !

0



  • హైద్రాబాద్‌ వేదికగానే స్కామ్‌ ప్లానింగ్‌ !
  • ఢల్లీి లిక్కర్‌ స్కాంలో వెలుగులోకి కీలక విషయాలు
  • మనీష్‌ సిసోడియా రిమాండ్‌ రిపోర్టులో సంచలన నిజాలు
  • ఈడీ చేతిలో కవిత, విజయ్‌ నాయర్‌, సమీర్‌ చాటింగ్‌ వివరాలు

ఢల్లీి లిక్కర్‌ స్కాం కేసులో వెలుగులోకి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢల్లీి డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాను ఈడీ అరెస్ట్‌ చేయగా, వారం రోజుల పాటు కస్టడీలోకి తీసుకుంది. అయితే.. సిసోడియా రిమాండ్‌ రిపోర్టులో ఈడీ కీలక విషయాలు వెల్లడిరచింది. లిక్కర్‌ స్కాం మొత్తం హైదరాబాద్‌ కేంద్రంగానే జరిగిందని,ఈ స్కాంలో కవితకు 33 శాతం వాటా ఉందంటూ ఈడీ కీలక అంశాలను ప్రస్తావించింది. అంతేకాకుండా.. కవిత, విజయ్‌ నాయర్‌, సమీర్‌.. చాటింగ్‌ చేసిన వివరాలు కూడా ఈడీ చేతికి చిక్కాయి.

ఢల్లీి లిక్కర్‌ స్కాం కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. రేపు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో.. సిసోడియా రిమాండ్‌ రిపోర్టులో పలుమార్లు కల్లకుంట్ల కవిత పేరును అధికారులు ప్రస్తావించారు. మద్యం కుంభకోణం కుట్రలో కవిత భాగస్వామిగా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. సౌత్‌ గ్రూపులో కవితది కీలక పాత్ర అని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈడీ చేతికి వీళ్ల మధ్య జరిగిన చాటింగ్‌ దొరికింది. ఈ చాటింగ్‌లో ప పేరుతో విజయ్‌ నాయర్‌, మేడమ్‌ పేరుతో కవిత, ూaఎవవ పేరుతో సమీర్‌ చాటింగ్‌ చేసినట్టు రిమాండ్‌ రిపోర్టులో ఈడీ పేర్కొంది. ఈ స్కాం మొత్తం హైదరాబాద్‌ కేంద్రంగానే జరిగినట్టు ఈడీ పేర్కొంది. ఐటీసీ కోహినూర్‌ హోటల్‌లో కుట్ర జరిగినట్టు తేల్చింది. ఆప్‌ పార్టీకి సౌత్‌ గ్రూపు నుంచి 100 కోట్ల రూపాయలు ముడుపులు ముట్టజెప్పినట్టు తెలుస్తోంది. కవిత తరపున అరుణ్‌ పిళ్లై ప్రాతినిధ్యం వహించారని విచారణలో వెల్లడైంది. అయితే... ఇండో స్పిరిట్లో 65 శాతం భాగం సౌత్‌ గ్రూప్‌దే కావటం గమనార్హం. ఈ గ్రూపులో కవిత కూడా ఓ భాగస్వామి అని తెలుస్తోంది. సిసోడియా రిమాండ్‌ రిపోర్టులో.. సౌత్‌ లాబీపైన ఈడీ పలు విషయాలు ప్రస్తావించింది. సౌత్‌ గ్రూప్‌లో అరుణ్‌ రామచంద్ర పిళ్ళై, సమీర్‌ మహేంద్ర, మాగంటి శ్రీనివాస్‌ రెడ్డికి 65 శాతం భాగస్వామ్యం ఉందని తేల్చింది. సౌత్‌ గ్రూప్‌ నుంచి 100 కోట్ల పైగా సొమ్మును వైసీపీ ఎంపీ మాగంటి శ్రీనివాసులతో కలిసి సౌత్‌ గ్రూప్‌ ఏర్పాటు చేశారు. సౌత్‌ గ్రూప్‌ వ్యవహారంలో ఆప్‌ నేత విజయ్‌ నాయర్‌ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తుంది. సౌత్‌ గ్రూప్‌ మొత్తం తొమ్మిది జోన్స్‌లను కైవసం చేసుకుంది. ఇండో స్పిరిట్‌లో పెట్టుబడులపై రామచంద్ర పిళ్లై ఇప్పుటికే ఈడీకి 11 సార్లు వాంగ్మూలం ఇచ్చారు. ఇండో స్పిరిట్‌లో బినామీ పెట్టుబడులు ఉన్నట్లుగా పేర్కొన్నారు.

కవితను అరెస్ట్‌ చేసే అవకాశం !

దేశ వ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత శనివారం నాడు ఈడీ ఎదుట హాజరుకాబోతున్నారు. సుదీర్ఘ విచారణ తర్వాత కవితను అరెస్ట్‌ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే, కవితను అరెస్ట్‌ చేయొచ్చని కామెంట్స్‌ చేయడంతో కచ్చితంగా విశ్వసనీయ వర్గాల సమాచారంతోనే ఇలా మాట్లాడి ఉండొచ్చని అందరూ భావిస్తున్నారు. అయితే.. కవితను అరెస్ట్‌ చేస్తే ఏం చేయాలనేదానిపై బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులకు కీలక సలహాలు, సూచనలు చేశారు. ఇవాళ బీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా కవిత ఈడీ విచారణ, రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు, సంక్షేమ పథకాలు ఇలా చాలా విషయాలపై నిశితంగా చర్చించారు. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా మీడియాకు రిలీజ్‌ చేయడం జరిగింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !