4 YSRCP MLA SUSPENSION : నలుగురు వైఎస్సార్‌సీపీ ఎమ్మేల్యేల సస్పెన్షన్‌ !

0


ఎమ్మెల్యే  కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో.. క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది వైఎస్సార్‌సీపీ. ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి  చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి , ఉండవల్లి శ్రీదేవిలను సస్పెండ్‌ చేసినట్లు వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడిరచారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌ నుంచి శుక్రవారం సాయంత్రం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. క్రాస్‌ ఓటింగ్‌పై అంతర్గత విచారణ జరిపాం. దర్యాప్తు తర్వాతే నలుగురిపై చర్యలు తీసుకున్నాం. ఇలాంటి కొనుగోలు వ్యవహారాలు ఏ పార్టీకైనా నష్టమే. రోగకారణాన్ని తక్షణం గుర్తించి ఇలాంటి వాటిని తొందరగా తొలగించుకోవాలి. అందుకే మా పార్టీ అధ్యక్షుడు సస్పెన్షన్‌ నిర్ణయం తీసుకున్నారు. విశ్వాసం లేనప్పుడు పార్టీలో ఉంచడం అనవసరం. అందుకే వారితో అవసరం లేదని తొలగించాము. చంద్రబాబు ఎమ్మెల్యేలను కొన్నారు. మాకున్న సమాచారం మేరకు.. డబ్బులు చేతులు మారినట్లు పార్టీ విశ్వసిస్తోంది.  ఒక్కోక్కొరికి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లకు చంద్రబాబు ఆఫర్‌ చేశారు. క్రాస్‌ ఓటింగ్‌ చేసినవాళ్లకు టికెట్‌ కూడా ఇస్తామని టీడీపీ చెప్పి ఉండవచ్చు  అని సజ్జల మీడియాకు వివరించారు. 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో  తెదేపా అభ్యర్థి పంచుమర్తి  అనురాధ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.  మొత్తం  23 ఓట్లు దక్కించుకుని మరీ ఎమ్మెల్సీగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో తెదేపా 23 ఎమ్మెల్యే స్థానాలు దక్కించుకుంది. ఆ పార్టీ నుంచి గెలిచిన నలుగురు సభ్యులు.. వైకాపాలో చేరారు. దీంతో తెదేపా బలం 19 స్థానాలకే పరిమితమైంది. అయితే గురువారం విడుదలైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో తెదేపా అభ్యర్థి అనురాధ 23 ఓట్లు సాధించారు. తెదేపా నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలను వైకాపా లాక్కోగా... అదే వైకాపాలో అసంతృప్తిగా ఉన్న వారిలో నలుగురు తెదేపా అభ్యర్థినికి ఓటు వేయటంతో అనురాధ 23 ఓట్లు సాధించగలిగారు. వాస్తవంగా తెదేపా బలం ఎంతో.. ఈ ఎన్నికల్లో అన్నే ఓట్లు వచ్చాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !