మూడుముళ్ళబంధంతో ఒక్కటైన మంచు మనోజ్‌, మౌనికరెడ్డి

0


నటుడు మంచు మనోజ్‌, భూమా మౌనికా రెడ్డి వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం శుక్రవారం రాత్రి  ఫిల్మ్‌నగర్‌లోని మంచు లక్ష్మీ నివాసంలో కొద్దిమంది అతిథుల సమక్షంలో అంగరంగవైభవంగా జరిగింది. వేదమంత్రాల సాక్షిగా ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం మనోజ్‌ మౌనికారెడ్డి మెడలో మూడుముళ్లు వేశాడు. ఇరు కుటుంసభ్యులు, సన్నిహితల సమక్షంలో వీరి వివాహం జరిగింది. మంచు మోహన్‌బాబు, విష్ణుతో పాటు ఇతర కుటుంబసభ్యులు కొత్త జంటను ఆశీర్వదించారు.దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా మనోజ్‌ పెళ్లిని స్వయంగా మంచు లక్ష్మీ తన భుజాన వేసుకొని జరిపించింది. పెళ్లి కొడుకును చేయడం దగ్గర్నుంచి మెహందీ, హల్దీ, పెళ్లి తంతు వరకు దగ్గరుండి చూసుకుంది. అయితే ఈ వేడుకలో మంచు మోహన్‌ బాబు కనిపించకపోవడంతో ఆయనకు పెళ్లి ఇష్టం లేదని, అందుకే హాజరు కావడం లేదనే వార్తలు వినిపించాయి. కానీ వీటన్నింటిని పటాపంచెలు చేస్తూ మోహన్‌ బాబు మనోజ్‌ పెళ్లికి విచ్చేశారు. తండ్రిగా తన దీవెనలు అందించి పెళ్లి జరిపించారు. ఈ క్రమంలో మౌనిక రెడ్డి మోహన్‌ బాబును పట్టుకొని కాస్త ఎమోషనల్‌ అయ్యింది. ఆయన కూడా కూతురులాగే ఆమెను దగ్గరకు తీసుకొని ఓదార్చారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది.



మనోజ్‌కు 2015లోనే ప్రణతి రెడ్డితో వివాహమైంది. పరస్పర అంగీకారంతో 2019లో వారిద్దరూ విడిపోయారు. మౌనికా రెడ్డికి గతంలో బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్తతో పెళ్లి జరిగి విడాకులు అయ్యాయి. ఇటీవల తమ కుటుంబ సన్నిహితురాలు, తన స్నేహితురాలు భూమా మౌనికా రెడ్డిని మనోజ్‌ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. గతేడాది సెప్టెంబరులో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ వినాయక మండపానికి వీరిద్దరూ కలిసి వెళ్లడంతో ఆ ఊహాగానాలకు బలం చేకూరింది. డిసెంబరులో కడప పెద్ద దర్గాను దర్శించుకున్న మనోజ్‌ ‘కొత్త జీవితం ప్రారంభిస్తున్నా’ అని అనడంతో అందరూ తన పెళ్లి గురించేనని ఫిక్స్‌ అయ్యారు. శుక్రవారం ఉదయం ‘పెళ్లి కూతురు’ అంటూ మౌనికా రెడ్డి ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి, అభిమానుల్ని సర్‌ప్రైజ్‌ చేశారు మనోజ్‌.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !