ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఒకటి రూపొందనుంది. NTR 30 వ ప్రాజెక్ట్‌గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో కథానాయికను చిత్రబృందం తాజాగా పరిచయం చేసింది. శ్రీదేవి పెద్ద కుమార్తె, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఇందులో ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా కనిపించనుందని ప్రకటించింది. ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని సైతం షేర్ చేసింది. మరోవైపు, ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంపై జాన్వి సంతోషాన్ని వ్యక్తం చేసింది. ‘‘ఎట్టకేలకు ఇది జరుగుతోంది. నేను ఎంతగానో అభిమానించే ఎన్టీఆర్‌తో కలిసి సందడి చేసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా’’ అని ఆమె పేర్కొంది.
ఎన్టీఆర్ అంటే తనకెంతో ఇష్టమని.. ఆయనతో కలిసి నటించాలని ఉందని జాన్వీకపూర్ ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో వెల్లడిరచారు. NTR 30లో అవకాశం వస్తే చేస్తానని ఆమె గతంలోనే చెప్పారు. తాజా ప్రకటనతో ఆమె కల నెరవేరినట్లు అయ్యింది. జాన్వీకపూర్‌కు ఇదే తొలి తెలుగు చిత్రం. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.
ఎన్టీఆర్ అమెరికా పయనం !
సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుకకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగే మార్చి 12న జరిగే వేడుకల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్’(RRR) చిత్రం ఒరిజినల్ స్కోర్ విభాగంలో తుది పోటీలో నిలిచింది. ఈ వేడుకలకు హాజరయ్యేందుకు ‘ఆర్‌ఆర్‌ఆర్’ బృందం ఒక్కొక్కరుగా ఆమెరికాకు పయనమవుతున్నారు. తాజాగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఎన్టీఆర్ బయల్దేరి వెళ్లారు. ఇప్పటికే రామ్ చరణ్ అమెరికా పర్యటనలో ఉన్నారు