లిక్కర్, ఇసుక అక్రమ రవాణా, మైనింగ్‌కు సీఎం జగన్ బ్రాండ్ అంబాసిడర్. జగన్ రాక్షస పాలన బ్రాండ్ చూసి పెట్టుబడులెలా వస్తాయి?’ అని మాజీ మంత్రి, తెదేపా నేత కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. ఎన్నికల సంవత్సరంలో పెట్టుబడుల అంశం గుర్తుకు రావడం ఆశ్చర్యంగా ఉంది. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే సంతోషమే. పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించేలా జగన్ పాలన సాగడం లేదు. పెట్టుబడిదారులకు అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నారు. సుప్రీంకోర్టులో ఉన్న రాజధాని అంశాన్ని మభ్యపెట్టి విశాఖను రాజధాని చేస్తాననడం ప్రజలను మోసం చేయడమే..’ అని ధ్వజమెత్తారు. ‘ఇప్పటం ప్రజలపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. జగన్ పాలన కూల్చివేతలతోనే ప్రారంభమైంది. ఈ ప్రభుత్వం ఎక్కడైనా ఒక్క కట్టడమైనా కట్టిందేమో సమాధానం చెప్పాలి. పవన్ కల్యాణ్ సభకు స్థలమివ్వడం ఇప్పటం ప్రజల తప్పా? తెదేపా, జనసేన కలిసి పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.