ఈడీ నోటీసులపై స్పందించిన ఎమ్మేల్సీ కవిత !

0


దిల్లీ మద్యం కేసులో తనకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నోటీసులు ఇవ్వడంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. రేపు దిల్లీలో విచారణకు రావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొందని తెలిపారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని చెప్పారు. లిక్కర్‌ స్కామ్‌లో తాను చేసింది ఏమీ లేదని, తాను దేనికీ భయపడబోనని ఆమె తెలిపారు. అరెస్ట్‌ చేస్తే ప్రజల దగ్గరికి వెళ్తా.. అంటూ ఆమె తెలిపారు. అలాగే.. ‘‘లిక్కర్‌  నేను ఫోన్లు ధ్వంసం చేయలేదు.  అడిగితే ఫోన్లు కూడా ఇస్తా.  గతంలో ఈ స్కామ్‌కు సంబంధించి ఆరు గంటలపాటు సీబీఐ అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం ఇచ్చా’’ అని ఆమె వివరించారు. 

ముందస్తు అపాయింట్‌మెంట్ల దృష్ట్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయసలహా తీసుకుంటాను. కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ను లొంగదీసుకోవడం కుదరదని భాజపా తెలుసుకోవాలి. ఈనెల 10న దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద భారత్‌ జాగృతి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఉంది. మహిళా బిల్లు కోసం ఒకరోజు నిరాహార దీక్ష తలపెట్టాం. మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలన్నది మా ప్రధానమైన డిమాండ్‌. ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాటం చేస్తాం. భాజపా వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం’’ అని కవిత ట్వీట్‌ చేశారు.

దిల్లీ మద్యం కేసులో హైదరాబాద్‌ వ్యాపారి అరుణ్‌ రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను గురువారం ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఈ కేసులో రామచంద్ర పిళ్లై.. కవితకు బినామీ అని ఈడీ మంగళవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి తెలిపిన విషయం తెలిసిందే. ఆప్‌ నేతలకు రూ.100 కోట్ల ముడుపులు ముట్టజెప్పిన సౌత్‌గ్రూప్‌ గుప్పిట్లో ఉన్న ఇండోస్పిరిట్స్‌ సంస్థలో  కవిత తరఫున అరుణ్‌ భాగస్వామిగా ఉన్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !