ప్రియురాలిని వేధిస్తున్నాడనే చంపేశా...హరిహరకృష్ణ

0


నవీన్‌ హత్య కేసులో ప్రధాన సూత్రధారి హరిహరకృష్ణ పోలీస్‌ కస్టడీ ముగిసింది. కస్టడీలో హరిహరకృష్ణ విస్తుపోయే నిజాలు వెల్లడిరచాడు. నవీన్‌ పరిచయం దగ్గర నుంచి అతడిని హత్య చేసి పోలీసులకు దొరికిపోయే వరకూ ప్రతి విషయాన్నీ పూసగుచ్చినట్లు వెల్లడిరచాడు. పోలీస్‌ కస్టడీలో హరిహరకృష్ణ ఏం వెల్లడిరచాడో అతని మాటల్లోనే.. ‘‘నేను ఇంటర్‌ 2017-2019 మధ్య దిల్‌షుఖ్‌నగర్‌లోని ఐడియల్‌ జూనియర్‌ కాలేజ్‌లో చదువుకున్నాను. నవీన్‌ నాకు ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌లో పరిచయం అయ్యాడు. నవీన్‌ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో, నేను అరోరా ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్నాం. నవీన్‌ నా దగ్గరికి , నేను నవీన్‌ కాలేజ్‌ దగ్గరికి తరుచూ వెళ్లి కలుసుకునే వాళ్ళం. నవీన్‌కు నీహారిక పరిచయం అయ్యాక.. ఇద్దరూ ప్రేమించుకుని అక్కడక్కడ తిరిగేవారు. ఇద్దరూ ఆ విషయాలు అన్నీ నాకు చెప్పేవాడు. నవీన్‌ ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడని.. నీహారిక గొడవ పడి.. అతనితో సరిగ్గా మాట్లాడటం మానేసింది.

అదే సమయంలో నీహారిక అంటే నాకు చాలా ఇష్టం ఏర్పడిరది. అందుకే ఆమెతో చనువుగా వుండే వాడిని. నవీన్‌ , నీహారిక ఇద్దరు విడిపోయారు అని తెలిసి.. 9 నెలల క్రితం నేను ప్రేమిస్తున్నానని నీహారికకు చెప్పాను. ఆమె కూడా ఒప్పుకుంది. అప్పటి నుండి ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. ఈ విషయం నవీన్‌కి తెలియదు. నవీన్‌ అప్పుడప్పుడు నీహారిక కు కాల్‌ చేసి, మెసేజ్‌లు చేస్తూ ఇబ్బంది పెట్టేవాడు. నవీన్‌ ఫోన్‌ చేసినా నీహారిక మాట్లాడేది కాదు. నవీన్‌ వేరే అమ్మాయిలతో తిరుగుతూ.. నిహారికను ఇబ్బంది పెడుతున్నాడు అని కోపంతో.. నవీన్‌ను చంపాలని మూడు నెలల క్రితం డిసైడ్‌ అయ్యాను. రెండు నెలల కింద మలక్‌పేట డీమార్ట్‌ లో 200 రూపాయలకు ఒక కత్తి కొన్నాను. మర్డర్‌ టైంలో నా ఫింగర్‌ ప్రింట్స్‌ పడకుండా... మెడికల్‌ షాప్‌ లో రెండు జతల ప్లాస్టిక్‌ గ్లౌజులు కొన్నాను. అవి ఎవరికీ కనపడకుండా నా బ్యాగ్‌ లో పెట్టి.. మా ఇంట్లోని సజ్జ మీద పెట్టాను. జనవరి 16 న మా ఇంటర్‌ ఫ్రెండ్స్‌ అంతా కలుసుకోవాలని అనుకున్నాము. కుదిరితే అదే రోజు నవీన్‌ను హత్య చేయాలని అనుకున్నా. కానీ ఆ రోజు అందరూ కలవడానికి కుదురలేదు. 

ఫిబ్రవరి 17 న ఉదయం 9 గంటలకు నవీన్‌ నాకు కాల్‌ చేసి.. హైదరాబాద్‌ వస్తున్నానని చెప్పాడు. ఆ రోజు నేను , నా ఫ్రెండ్‌ జీవన్‌ ఇద్దరం కలిసి ఉప్పల్‌లో సినిమాకి వెళ్లాం. నవీన్‌ ఎల్‌బీనగర్‌లో ఉన్నానని నాకు కాల్‌ చేసాడు. నా బైక్‌పై వెళ్లి.. నేను, జీవన్‌ పికప్‌ చేసుకున్నాం. నాగోల్‌లో భోజనం చేశాక... జీవన్‌ వెళ్ళిపోయాడు. నేను, నవీన్‌ మలక్‌పేటలోని మా ఇంటికి వెళ్ళాము. ఆ రోజు రాత్రి నవీన్‌ హాస్టల్‌కు వెళతానంటే.. నేను కూడా వస్తానని చెప్పాను. నవీన్‌ను చంపటానికి ఇదే మంచి ఛాన్స్‌ అనుకుని.. సజ్జ మీద వున్న బ్యాగ్‌ తీసుకున్నా. నా ఫోన్‌ నుంచి నవీన్‌ నీహారికకు కాల్‌ చేసి 6,7 నిముషాలు మాట్లాడాడు. ఆ తరువాత రాత్రి 11 గంటలకు ఓఆర్‌ఆర్‌ దాటగానే ఈ టైంలో అంత దూరం వద్దు అని చెప్పి మందు తాగాము. ఆ తరువాత.. నిహారిక గురించి నీకు ఒక విషయం చెప్పాలి అన్నాను. అందుకు నవీన్‌ కూడా ఏంటో చెప్పమన్నాడు. కొంచెం లోపలికి వెళ్తే నీకు విషయం మొత్తం చెప్తాను అని చెప్పడంతో నవీన్‌ కూడా ఓకే అన్నాడు.

ఎవరు లేని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నిహారికను నేను ప్రేమిస్తున్నానని.. ఆమెను ఫోన్‌లు చేసి ఎందుకు ఇబ్బంది పెడుతున్నావని ప్రశ్నించాను. వెంటనే నవీన్‌ నన్ను కొట్టాడు. అప్పటికే నవీన్‌ ను చంపాలన్న ప్లాన్‌తో ఉన్న నేను అతని బలంగా కొట్టి.. గొంతు నులిమి చంపేశాను. ఆ తర్వాత శ్వాస ఆడట్లేదని నిర్ధారించుకుని నా బ్యాగులో ఉన్న కత్తితో కోపంతో చాతి భాగం నుంచి పొట్ట భాగం వరకు అడ్డం పొడుగు కోసేసి.. అతని గుండెను శరీరం నుంచి వేరు చేసి.. మర్మాంగాన్ని కోసేశా. ఆ తర్వాత శవాన్ని ఎవరికీ కనబడకుండా చెట్లపొదల్లో పడేసాను. ఆ తర్వాత నవీన్‌ శరీర భాగాలన్నీ ఓ బ్యాగులో వేసుకొని బ్రాహ్మణపల్లి వైపు వెళ్లాను. అతని సెల్‌ఫోన్‌ని రోడ్డు పక్కన పడేసాను. రక్తంతో ఉన్న నవీన్‌ శరీర భాగాలను దూరంగా.. రాజీవ్‌ గృహకల్ప వెనకాల చెట్లపొదల్లో పడేసి బ్రాహ్మణపల్లిలో నేను నా ఫ్రెండ్‌ హాసన్‌ ఇంటికి వెళ్ళాను.

బాత్రూంలోకి వెళుతూ ఇంట్లో ఉన్న ఒక ఖాళీ ప్లాస్టిక్‌ బియ్యం సంచిని బాత్రూంలోకి తీసుకెళ్లి అతనికే తెలియకుండా రక్తంతో ఉన్నా నా బట్టలు విప్పేసి సంచిలో వేసి బాత్రూంలో ఉన్న హసన్‌ బట్టలు వేసుకున్నాను. తర్వాత నేను బయటికి వచ్చాక నా బట్టలు ఎందుకేసుకున్నావని అడిగితే నేను నవీన్‌ని చంపిన విషయం చెప్పాను. అప్పుడు హసన్‌ భయపడి ఎందుకు అలా చేశావని నన్ను తిట్టి వెంటనే పోలీసులకు లొంగిపోవాలని చెప్పాడు. ఇప్పుడు చీకటి అయింది ఉదయం వెళ్తానని అతనికి చెప్పాను. అతను వద్దు అని చెప్పినా వినకుండా నేను అక్కడే ఆరోజు రాత్రి పడుకుని మరుసటి రోజు ఉదయం లేచి నేను పోలీసులకు లొంగిపోతానని చెప్పి రక్తంతో ఉన్న నా బట్టలు షూస్‌ బ్యాగును సాగర్‌ కాంప్లెక్స్‌ బస్‌ స్టాప్‌ వద్ద రోడ్డు పక్కన చెత్త కుప్పలో పడేశా.

ఉదయం 10 గంటలకు నిహారిక కు ఫోన్‌ చేసి రోడ్డు మీదకి రమ్మన్నాను. అప్పుడు నవీన్‌ని చంపానని నిహారికతో చెప్పాను. దాంతో ఆమె భయపడి ఎందుకలా చేశావని నన్ను తిట్టి మందలించింది. ఆ తర్వాత నేను మా ఇంటికి వెళ్లి నా బండిని మా ఇంటి దగ్గర పెట్టి వరంగల్‌లో ఉన్న మా నాన్న దగ్గరికి వెళ్ళాను. ఆ తర్వాత మా నాన్నకు విషయం చెప్పడంతో పోలీసుల ముందు లొంగి పోవాలని చెప్పాడు. నేను 24వ తేదీ హాసన్‌ ఇంటికి రాగా పోలీసులు నీ గురించి నన్ను అడుగుతున్నారు ఇంకా ఎందుకు పోలేదని నిలదీశాడు. దీంతో నేరుగా నవీన్‌ శరీర భాగాలు పడేసిన ప్రాంతానికి వెళ్లి ఆ సంచిని తీసుకొని... హత్య చేసిన స్పాట్‌ కి వచ్చాను. అక్కడే శరీర భాగాలన్నీ కాల్చేశాను. ఆ తర్వాత అబ్దుల్లాపూర్మెట్‌ పోలీసుల ముందు లొంగిపోయి హత్య విషయం చెప్పాను’’ అని హరిహరకృష్ణ వెల్లడిరచాడు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !