- బీజేపీ పాలన ఉన్న రాష్ట్రాల్లో ఈడీ, సిబిఐలు ఉండవు.
- అదానీయే మోడీ బినామీ !
- కర్ణాటకలో పట్టుబడ్డ బీజేపీ నేతలపై కేసులేవీ !
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. తన సోదరి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢల్లీి లిక్కర్ స్కామ్ విషయంలో ఈడీ మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రులు, పలువురు బీఆర్‌ఎస్ నేతలతో కలిసి కేటీఆర్ మీడియా సమావేశంలో కేంద్రంపై విరుచుకుపడ్డారు. కేంద్రం చేతిలో ఈడీ కీలుబొమ్మలా ఆడుతోందని అలాగే సీబీఐ తోలుబొమ్మలా మారింది అంటూ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తారని విమర్శించారు..బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇచ్చిన నోటీసులు ఈడీ సమన్లు కాదు మోడీ సమన్లు అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ బీజేపీ పాలనపై విమర్శలు చేయటం వల్లే తమ పార్టీ నేతలపై ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. దేశంలో బీజేపీ పాలన వచ్చినప్పటినుంచి ఇదే కొనసాగుతోందని ఒకప్పుడు ఈడీ, సీబీఐ దాడులకు ఓ అర్థం ఉండేది. కానీ ఇప్పుడలా కాదు..దేశంలో గత ఎనిమిది ఏళ్లుగా జుమ్లా, లేకుంటే హమ్లా అన్నట్లుగా ఉందని కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు సంధించారు.ఈడీ సమన్లు కాకుండా దేశంలో మోడీ సమన్లే జారీ అవుతున్నాయని ఇవన్నీ బీజేపీని విమర్శించే నేతలను భయపెట్టటానికేనని అన్నారు కేటీఆర్.
బీజేపీయేతర పాలనలో ఉండే రాష్ట్రాల్లోనే ఇటువంటి దాడులు జరుగుతున్నాయని ఆరోపించిన కేటీఆర్ గుజరాత్‌లో ఇటువంటివి జరుగుతున్నాయా? అని ప్రశ్నించారు. గుజరాత్‌లో వేల కోట్ల రూపాయల హెరాయిన్ పట్టుబడిరది అని కానీ ఇటువంటివాటిపై దర్యాప్తు మాత్రం జరగదని ఎందుకంటే గుజరాత్‌లో బీజేపీ పాలన ఉంది కాబట్టే దర్యాప్తులు జరగవు అని విమర్శించారు. తమను విమర్శిస్తే ఈడీ, సీబీఐ దాడులు..ప్రశ్నిస్తే నిధులు రాకుండా వేధించటం మాత్రమే బీజేపీ చేస్తుందని విమర్శించారు. కేంద్రం అహంకారంతో వ్యవహరిస్తోందని..ఇటువంటి బెదిరింపులకు బీఆర్‌ఎస్ భయపడదని స్పష్టంచేశారు.
గౌతం అదాని ఎవరి బినామీ అని అడిగితే చిన్నపిల్లలు కూడా మోడీ అని చెబుతారు అంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్. ఒక సంస్థకు (అదానీ గ్రూప్) ఆరు ఎయిర్ పోర్టులు పెట్టేందుకు నిబంధనలు మార్చింది నిజం కాదా? గుజరాత్ లో అదాని పోర్టులో దొరికిన హైరాయిన్ దొరికినా కేసులు ఎందుకు లేవు? అని ప్రశ్నించారు. ప్రశ్నించిన వారిపై ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తూ స్వయం ప్రతిపత్తి సంస్థలను కూడా భ్రష్టుపట్టించారని..భయపెట్టి..బెదిరించి నేతలను తమ పార్టీలో చేరేలా వ్యవహరిస్తున్నారని..అప్పటి వరకు అవినీతి చేసిన నేతలు బీజేపీలో చేరితే నేతలు పునీతులు అయిపోతారా? అంటూ సెటైర్లు వేశారు.దేశంలో ఎం జరుగుతోందో పక్క దేశాలు స్పష్టంగా చెబుతున్నాయని భారత మీడియాను లెక్క చేయనని బీబీసీపై దాడి జరిపేలా ప్రధాని సంకేతాలు ఇచ్చారని ఆరోపించారు. అదాని కంపెనీల ప్రచారం కోసం ప్రధాని పని చేస్తున్నారంటూ విమర్శించారు కేటీఆర్. ప్రధాని మోడీ వచ్చిన తరువాత 5,423 కేసులు పెట్టారని కానీ 23 కేసుల్లో మాత్రమే నిరూపించారని ఈ సందర్బంగా కేటీఆర్ గుర్తు చేశారు. ప్రతిపక్షాలను లేకుండా చేయాలని కేంద్రం అహంకారపూరితంగా వ్యవహరింస్తోందన్నారు. కర్నాటకలో లంచం తీసుకుంటు పట్టుబడ్డ బీజేపీ నేతలపై కేసులు లేవని.. 9 ఏళ్లల్లో 9 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన ఘనత మోడీది కాదా? అని ప్రశ్నించారు. ఇలా బీజేపీ ఏతర ప్రభుత్వాలను కూల్చేస్తూ దేశంమంతా బీజేపీయే పాలించాలనే అహంకారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. అదాని దందాలతో బీజేపీకి చందాలు అందుతున్నాయంటూ ఎద్దేవా చేశారు.
కాగా ఢల్లీి లిక్కర్ స్కామ్ లో ఈడీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరుకావాలని తెలిపింది. దీంతో కవిత తాను సామాజిక కార్యకర్తనని, తన కార్యక్రమాలు వారం ముందే ఖరారు అయ్యాయని ఈడీకి రాసిన లేఖలో కవిత తెలిపారు. మహిళా రిజర్వేషన్లపై ఆందోళనకు ఢల్లీికి వెళ్లిన కవిత ఇవాళ మార్చి 9న విచారణకు రాలేనని తేల్చి చెప్పారు. దీంతో కవిత విజ్ఞప్తిని ఈడీ అంగీకరించింది. కవిత లేఖ ప్రకారం విచారణ వాయిదా వేసేందుకు ఈడీ ఓకే చెప్పింది. మార్చి9న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపింది. ఈ మేరకు ఈడీకి ఎమ్మెల్సీ కవిత ఒక లేఖ రాశారు. మార్చి 10న ఢల్లీిలో తమకు కార్యక్రమం ఉంది కాబట్టి మార్చి 11న విచారణకు హాజరు అవుతానని ఈడీకి లేఖ రాశారు. కవిత లేఖకు స్పందించిన ఈడీ అనుమతి ఇస్తూ..విచారణను మార్చి11వ తేదీకి వాయిదా వేసింది.
ఢల్లీి లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే అరెస్టైన మద్యం వ్యాపారి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు బినామీగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ విచారిస్తోంది. ఈడీ విచారణలో రామచంద్ర పిళ్లై కీలక విషయాలు వెల్లడిరచాడు. తాను ఎమ్మెల్సీ కవితకు బినామీ అని, ఆమె ఆదేశాల మేరకే తాను పని చేసినట్లు ఈడీకి చెప్పాడు. ఈ క్రమంలో కవితను విచారించాలని ఈడీ నిర్ణయించింది. దీంతో బుధవారం కవితకు నోటీసులు జారీ చేసింది. ఢల్లీిలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో జరిగే విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రామచంద్ర పిళ్లైతో కలిసి కవితను అధికారులు విచారించబోతున్నారు.