అగ్ర కథానాయిక SAMANTHA మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. శాకుంతలం ( SHAAKUNTALAM ) సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చిన SAMANTHA తన పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో విషయాలను బయట పెట్టింది. అంతే కాకుండా PUSHPA మూవీలో ఐటెమ్ సాంగ్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపింది. ‘వైవాహిక జీవితంలో 100 శాతం నిజాయితీగానే ఉన్నానని.. కాకపోతే అది వర్కౌట్ కాలేదు. అలాంటప్పుడు నేనెందుకు ఏదో నేరం చేసినట్టు ఇంట్లోనే కూర్చోవాలి అని ప్రశ్నించింది సామ్. తాను విడాకులు తీసుకున్న కొంతకాలానికే PUSHPA మూవీలో ఐటెమ్ సాంగ్ ఆఫర్ వచ్చింది. నేనేమీ తప్పు చేయలేనప్పుడు ఎందుకు ఇంట్లోనే బాధపడుతూ కూర్చోవాలి.. అందుకే వెంటనే ఆ సాంగ్ కి ఓకే చెప్పాను అని తెలిపింది. ఆ పాటను అనౌన్స్ చేసినప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులు నాకు ఫోన్లు చేసి.. ప్రస్తుతం నువ్వు ఇంట్లో కూర్చో చాలు.. విడిపోయిన వెంటనే ఐటెమ్ సాంగ్స్ చేయడం బాగోదు అంటూ సలహాలు ఇచ్చారు. కానీ నేను దానికి ఒప్పుకోలేదు.. అంటూ వెల్లడిరచింది సమంత.
ఏ నటికి రాకూడని పరిస్థితి..!
‘‘నేను ఇప్పటికే ఎన్నో బాధలుపడ్డాను. ఓ నటిగా ప్రతి విషయంలో పర్‌ఫెక్ట్‌గా ఉండాలని, మరింత అందంగా కనిపించాలని కష్టపడుతూనే ఉన్నాను. మయోసైటిస్, మెడికేషన్ కారణంగా నాపై నాకే కంట్రోల్ లేకుండా పోయింది. దానివల్ల ఒక్కోసారి నేను నీరసంగా కనిపించవచ్చు, ఒక్కోసారి బొద్దుగా కనిపించవచ్చు. నేను స్టైల్ కోసం కళ్లద్దాలు పెట్టుకుంటున్నానని కొంతమంది అనుకోవచ్చు. కాకపోతే అది నిజం కాదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వెలుతురిని నా కళ్లు తట్టుకోలేవు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఏ నటికి రాకూడదు. ఎందుకంటే కళ్లతోనే నటీమణులు పలు భావాలు పలికించాలి. గడిచిన ఎనిమిది నెలలుగా ప్రతి రోజూ నేను పోరాటం చేస్తూనే ఉన్నాను. బాధను అనుభవిస్తూనే ఉన్నాను. అన్నింటినీ దాటుకుని ఈ స్థాయికి వచ్చాను. కాబట్టి, ఇప్పుడు ఎవరైనా సరే నా లుక్స్ గురించి కామెంట్స్ చేసినా నేను పెద్దగా పట్టించుకోను’’ అని సమంత వివరించారు.