Chandrababu Comments on CM Jagan : ఇక జగన్‌ జన్మలో ముఖ్యమంత్రి కాలేరు - చంద్రబాబు

0

వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేయాలని చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. బద్వేలులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. బంధువులు, రక్త సంబంధీకులు వదిలేసినా తెలుగుదేశం పార్టీ మీ వెంట ఉంటుందని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. విదేశాల్లో స్థిరపడ్డ తెలుగుదేశం కార్యకర్తలు పార్టీకి విరాళాలు ఇవ్వాలని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపునిచ్చారు. రూ. 5 వేలు విరాళం ఇచ్చిన వారికి జీవితకాల సభ్యత్వం ఇస్తామని చెప్పారు. ఇక, కార్యకర్తలను ఆదుకునే బాధ్యత పార్టీదే అని స్పష్టం చేశారు.

జగన్‌ ఓ ఐరన్‌లెగ్‌

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిపై చంద్రబాబు ధ్వజమెత్తారు. సీఎం జగన్‌ ఎక్కడ ఉంటే.. అక్కడ శని అని అన్నారు. జగన్‌ ఓ ఐరన్‌లెగ్‌ అని.. అమరావతిని నాశనం చేశారని దుయ్యబట్టారు. ఇప్పుడు విశాఖపట్నం నుంచి పారిపాలిస్తానని చెబుతున్నారని.. ఆయన్ను చూసి విశాఖ వాసులు భయపడుతున్నారని చెప్పారు. జగన్‌ పదవికి ఎక్స్‌పైరీ డేట్‌ వచ్చేసిందని.. ఇకపై జన్మలో ఆయన ముఖ్యమంత్రి కాలేరని వ్యాఖ్యానించారు. సీఎం జగన్మోహన్‌ రెడ్డి పరిపాలనపై ప్రజలు కోపంగా ఉన్నారని చంద్రబాబు చెప్పారు. ఇచ్చేది 10 రూపాయలు అయితే.. తీసుకునేది వంద రూపాయలని విమర్శించారు. బటన్‌ నొక్కి రూ. 2 లక్షల కోట్లు ఇచ్చానంటున్న సీఎం జగన్‌.. మరో రూ. 2 లక్షల కోట్లు దోచేశారని చంద్రబాబు ఆరోపించారు.

‘నా పార్టీనే.. నా భవిష్యత్‌’

‘నా పార్టీనే.. నా భవిష్యత్‌’ నినాదంతో ముందుకు వెళ్లాలని చంద్రబాబు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సాగునీటికి ప్రాధాన్యత ఇచ్చారని.. తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు, నగరి.. ప్రాజెక్టులను ప్రారంభించిన ఘనత ఎన్టీఆర్‌దే అని కొనియాడారు. హైదరాబాద్‌ అభివృద్ధిలో టీడీపీ పాత్ర ఎంతో కీలకమన్నారు.కాగా చంద్రబాబు 73వ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక గీతం ఆవిష్కరణ జరిగింది. చంద్రబాబు జీవిత ప్రస్థానంపై ప్రత్యేక కథాగానం చేశారు. ఈ కథాగానాన్ని కేశినేని చిన్ని, వెనిగండ్ల రాము రూపొందించారు. చంద్రబాబు జీవిత చరిత్రపై 6:50 నిమిషాల నిడివి ఉన్న గీతాన్ని రూపకల్పన చేశారు. ఈ గీతాన్ని విజయవాడలో టీడీపీ నేతలు దేవినేని ఉమా, గద్దె రామ్మోహన్‌, బుద్దా వెంకన్న, వర్ల రామయ్య, నాగుల్‌ మీరా తదితరులు ఆవిష్కరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !